Gold Silver Prices Today : దీపావళి పండుగ వేళ గోల్డ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గుతున్న ధరలు.. నేటి రేట్లు ఇవే..

Gold Silver Prices Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ధరలు భారీగా తగ్గాయి.

1/7
Gold Silver Prices Today : మరో పది రోజుల్లో దీపావళి పండుగ రాబోతుంది. ఈ పండుగ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. ఈసారి పండుగకు గోల్డ్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ప్రస్తుతం గోల్డ్ రేటు భారీగా తగ్గుతోంది. రానున్న పది రోజుల్లోనూ ధరలు భారీగా తగ్గే చాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
2/7
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1690 తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1550 తగ్గింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3992 డాలర్లకు పడిపోయింది.
3/7
వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గురువారం కిలో వెండిపై రూ.5వేలు తగ్గుదల చోటు చేసుకోగా.. ఇవాళ (శుక్రవారం) కూడా వెండి ధర మరో రూ.5వేలు తగ్గింది. మొత్తంమీద గడిచిన పది రోజుల్లో కిలో వెండిపై రూ. 25వేలు తగ్గుదల చోటు చేసుకుంది. దీపావళి నాటికి మరింత తగ్గుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,42,260 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,30,400 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,410 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,30,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,260కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,30,400 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,10,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,10,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,10,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.