Gold Silver Prices Today : దీపావళి పండుగ వేళ బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే

Gold Silver Prices Today November 7: దీపావళి వేళ బంగారం, వెండి కొనుగోళ్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ గోల్డ్ రేటు పెరిగింది.

Gold Silver Prices Today 7 November 2026 In Hyderabad Visakhapatnam

Gold Silver Prices Today : దీపావళి పండుగ సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి ధరలు షాకిస్తున్నాయి. శుక్రవారం గోల్డ్ రేటు భారీగా పెరగ్గా.. శనివారం కూడా పెరిగింది.

Also Read – Bigg Boss Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వంశీని భుజాల మీదకు ఎత్తుకున్న త్రిగున్.. ఏడ్చేసిన వర్షిణి..

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు బంగారంపై 14డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,070 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,570 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,600 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,31,750 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,570కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,05,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,05,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.