Gold Silver Prices Today : బంగారం కొనుగోలుదారులకు బిగ్ అప్డేట్.. ధరల్లో కీలక మార్పులు.. నేటి రేట్లు ఇవే..

Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. గోల్డ్ రేటులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

1/6
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్న వారికి బిగ్ అప్డేట్. గోల్డ్ రేటు దూకుడు కొనసాగుతూనే ఉంది. మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
2/6
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1030 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 950 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 49డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,120 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి రేటులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
3/6
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,600 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,550 వద్ద కొనసాగుతోంది.
4/6
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,750 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,32,700 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,560కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,590 వద్ద కొనసాగుతోంది.
5/6
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,05,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,05,000 వద్ద కొనసాగుతోంది.
6/6
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.