Gold Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి రేట్లు ఇవే..

Gold Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. నేడు గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగాయి.

1/6
Gold Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో నేడు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం రేటు తాజాగా.. భారీగా పెరిగింది. వెండి ధరసైతం పెరిగింది.
2/6
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 770 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.700 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రమ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 20 డాలర్లు తగ్గడంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,034 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర పెరిగింది. మంగళవారం భారీగా తగ్గిన వెండి రేటు.. ఇవాళ భారీగా పెరిగింది.
3/6
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,570 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది.
4/6
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,720 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,750 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,570కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది.
5/6
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది.
6/6
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు