Gold Silver Rate Today : బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..

Gold Silver Rate Today : అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో సోమవారం బంగారం ధర తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

1/6
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ ధర భారీగా తగ్గింది. సిల్వర్ రేటు స్థిరంగా కొనసాగుతోంది.
2/6
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.930 తగ్గింది.. 22 క్యారెట్ల బంగారంపై రూ.850తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. అక్కడ ఔన్సు బంగారంపై 33 డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం ఔన్సుగోల్డ్ 4,055డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
3/6
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,020 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,31,100 వద్దకు చేరింది.
4/6
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,170 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,020కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,100 వద్ద కొనసాగుతోంది.
5/6
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,40,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్దకు చేరింది.
6/6
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.