Gold Silver Rate Today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..
Gold Silver Rates Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గాయి.
- Harish Thanniru
- Updated on- June 30, 2026 / 10:10 AM IST
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండోరోజు బంగారం ధర భారీగా తగ్గింది.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1800 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1650 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు బంగారంపై 40 డాలర్లు తగ్గింది. దీంతో చాలారోజుల తరువాత ఔన్సుగోల్డ్ 3,976 డాలర్ల వద్దకు దిగొచ్చింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,40,130 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,28,450 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,40,280 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,28,600 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,45,080కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,990 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,49,900 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,44,900 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
