Gold Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Silver Rates Today : నేడు బంగారం ధర స్వల్పంగా పెరగ్గా.. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.

1/7
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు ఇవాళ పెరిగింది.
2/7
ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ వార్ మొదలు కావడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకుతోడు అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
3/7
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 16డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ ధర 4,061డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. బుధవారం కిలో వెండిపై రూ.5వేలు తగ్గగా.. ఇవాళ వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,240 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,31,300 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,390 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,450 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,220కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,200 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్దకు చేరింది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.