Google Pixel 10 Pro XL : వారెవ్వా.. అద్భుతమైన డిస్కౌంట్.. గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. జస్ట్ ఎంతంటే?
Google Pixel 10 Pro XL : గూగుల్ ఫ్లాగ్‌షిప్ మోడల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇలా కొన్నారంటే ఏకంగా రూ. 8వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ పూర్తి డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Updated on- May 18, 2026 / 09:36 PM IST
Google Pixel 10 Pro XL : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? గూగుల్ ఫ్లాగ్‌షిప్ మోడల్ పిక్సెల్ 10 ప్రో XL ధర భారీగా తగ్గింది. గత ఏడాదిలో లాంచ్ అయిన ఈ పిక్సెల్ ఫోన్ ఇప్పుడు అత్యంత తగ్గింపు ధరతో లభిస్తోంది. పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్‌లో ఎఫ్/1.68 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా 42MP డ్యూయల్ PD ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్‌పై డిస్కౌంట్లు, ధర, స్పెసిఫికేషన్లతో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ధర, ఆఫర్లు : గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ 16GB/256GB స్టోరేజ్ వేరియంట్, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,24,999 ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ కింద మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 8వేలు తగ్గింపు పొందవచ్చు.
అసలు ధర రూ. 1,24,999 అవుతుంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా ధరను రూ. 50,950 వరకు తగ్గించుకోవచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ అనేది మీ పాత ఫోన్ మోడల్ వర్కింగ్ కండిన్‌పై ఆధారపడి ఉంటుంది.
పిక్సెల్ 10 ప్రో ఎక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ 6.8-అంగుళాల సూపర్ యాక్చువా ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1344x2992 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 1-120Hz, గరిష్టంగా 3,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ పొడవు 162.8 మిమీ, వెడల్పు 76.7 మిమీ, మందం 8.5 మిమీ, బరువు 232 గ్రాములు ఉంటుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్‌లో ఎఫ్/1.68 అపర్చర్‌తో 50MP వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్/1.7 అపర్చర్‌తో 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్/2.8 అపర్చర్‌తో 48MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 42MP డ్యూయల్ పీడీ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ సిమ్, వై-ఫై 7, బ్లూటూత్ v6, NFC, GPS, గూగుల్ కాస్ట్, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి 3.2 పోర్ట్ ఉన్నాయి.
