Florida: అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్ హరికేన్ విలయం.. (ఫొటోలు)
Florida:అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయాన్ హరికేన్ విధ్వంసం సృష్టించింది. హరికేన్ ప్రతాపానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు. భయానక గాలులు, కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ నీటమునిగాయి. రహదారులన్నీ నీటమునిగాయి, ఇళ్లలోకి వరదన నీరు చేరింది. ఇంటిముందు పార్కు చేసిన వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇయాన్ హరికేన్ విధ్వంసానికి యునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లోరిడాలో 12మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. కూలిన గృహాలు, ప్రమాదకరమైన నీటి ప్రవాహాలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇదిలాఉంటే ఇటీవలి యుఎస్ చరిత్రలో అత్యంత ఘోరమైనది తుఫాన్ గా దీనిని అధికారులు అభివర్ణించారు.