Andhrapradesh : ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన బాలకృష్ణ, నాగబాబు.. ఫొటో గ్యాలరీ
Andhrapradesh : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు.
- Harishth Thanniru
- Updated on- February 12, 2026 / 01:49 PM IST
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన కనిపించింది. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాంబర్ కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కొద్దిసేపు పలు సమస్యలపై వీరు చర్చించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు కూడా భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జనసేన పార్టీకి సంబంధించిన పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తన చాంబర్‌కు వెళ్లి కలిసిన నాగబాబు.. తమ్ముడు భుజంపై చేయివేసి ఫొటో దిగారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఎమ్మెల్యే ఎం. అశోక్ రెడ్డి కలిశారు.
అదేవిధంగా బుధవారం శాసనసభలోని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీలో ఆయన్ను పలువురు మంత్రులు కలిశారు. వీరిలో మంత్రి నారా లోకేశ్, పయ్యావుల కేశవులు, నాదెండ్ల మనోహర్ తదితరులు కలిశారు.
