iQOO Z11 Lite : భలే ఉంది భయ్యా ఫోన్.. రూ. 20 వేల లోపు ధరకే ఐక్యూ లైట్ వస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

iQOO Z11 Lite : ఐక్యూ నుంచి ఖతర్నాక్ ఫోన్ రాబోతుంది. పవర్ ఫుల్ ఫీచర్లతో అత్యంత సరసమైన ధరలో రాబోతుంది. రూ. 20వేల బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ తీసుకోవచ్చు. లాంచ్, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..

1/6
iQOO Z11 Lite : ఐక్యూ లవర్స్ కు గుడ్ న్యూస్.. వచ్చే వారం భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 లైట్ వచ్చేస్తోంది. అంతకన్నా ముందే కంపెనీ ఈ సరికొత్త ఫోన్‌కు సంబంధించి టీజర్‌లను రిలీజ్ చేసింది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రేంజ్ ఇప్పుడు వెల్లడైంది. ఈ మిడ్-రేంజ్ ఐక్యూ ఫోన్ కోసం స్పెషల్ మైక్రోసైట్ కూడా క్రియేట్ చేసింది.
2/6
బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్, కెమెరా, డిస్‌ప్లే ఫీచర్ల వివరాలను కూడా రివీల్ చేసింది. స్పీడ్, మల్టీటాస్కింగ్ కోసం ఐక్యూ జెడ్11 లైట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఐక్యూ జెడ్11 లైట్ వచ్చే వారం జూలై 24న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
3/6
భారత్‌లో ఐక్యూ జెడ్11 లైట్ ధర : నివేదిక ప్రకారం.. ఐక్యూ స్మార్ట్‌ఫోన్ రూ. 20వేల కన్నా తక్కువ ప్రారంభ ధరతో లాంచ్ కానుంది. విద్యార్థులను ప్రాథమిక యూజర్లను లక్ష్యంగా కంపెనీ తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ అందించనుంది.
4/6
అంతేకాదు.. ఈ ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 20 గంటల వరకు సోషల్ మీడియా స్క్రోలింగ్, 80 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
5/6
ఈ ఐక్యూ ఫోన్ 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 8 గంటల కాలింగ్, 7.2 గంటల ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 5 ఏళ్ల వాడకం తర్వాత కూడా బ్యాటరీ అంతే 80శాతం ఛార్జింగ్ అందిస్తుందని చెబుతోంది.
6/6
ఈ ఫోన్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ 2.0కి కూడా సపోర్ట్ చేస్తుంది. మన్నిక కోసం MID-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.