Jaya Krishna Ghattamaneni : గురువారం మూవీ రిలీజ్.. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న జయకృష్ణ ఘట్టమనేని
జయకృష్ణ ఘట్టమనేని(Jaya Krishna Ghattamaneni), రషా తడానీజంటగా నటిస్తున్న మూవీ శ్రీనివాస మంగాపురం. జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో బుధవారం తిరుమల శ్రీవారిని హీరో జయకృష్ణ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 29, 2026 / 05:10 PM IST
