Dushyanth : ఎంపీ కూతుర్ని నిశ్చితార్థం చేసుకున్న హీరో.. ఫోటోలు వైరల్.. విజయ్ రష్మిక పెళ్లి రోజే..
తన నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు దుష్యంత్.
- Saketh U
- Published On : February 16, 2026 / 03:15 PM IST
ఎంపీ కూతుర్ని నిశ్చితార్థం చేసుకున్న హీరో..
ఇటీవలే కన్నడ, తెలుగులో గత వైభవం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దుష్యంత్. కన్నడలో ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా తెలుగులో ఫ్లాప్ అయింది.
దుష్యంత్ తండ్రి ఎస్ఆర్ శ్రీనివాస్ కర్ణాటక గుబ్బి నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఇటీవలే దుష్యంత్ మాజీ ఎంపీ ఎస్పీ మద్దెహనుమగౌడ కుమార్తె రచనని నిశ్చితార్థం చేసుకున్నాడు.
తన నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు దుష్యంత్.
దుష్యంత్ పెళ్లి ఫిబ్రవరి 26న, రిసెప్షన్ మార్చ్ 1న జరగనుందని తెలిపాడు. దీంతో అభిమానులు, కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి కూడా ఫిబ్రవరి 26నే జరగనుంది. ఆ రోజే దుశ్యంత్ రచనల పెళ్లి కూడా కాబోతుండటం గమనార్హం.
