Motorola Edge 70 Max : మోటోరోలా మజాకా.. ఈ నెల 15న కొత్త మోటో 70Max వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్..
Motorola Edge 70 Max : మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫోన్ జూలై 15న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ముందుగానే ఈ మోటోరోలా ఫోన్ కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.
- Sreehari A
- Published on- July 10, 2026 / 08:22 PM IST
Motorola Edge 70 Max : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. ఈ నెల 15న భారత మార్కెట్లోకి మోటోరోలా నుంచి కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ వచ్చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కూడా అధికారికంగా రివీల్ చేసింది. ఈ మోటోరోలా ఫోన్, కంపెనీ ఎడ్జ్ 70 లైనప్‌లో వస్తుంది.
ఈ సిరీస్‌లో గత మోడళ్లలో కనిపించే కర్వ్డ్ డిస్‌ప్లేలకు భిన్నంగా ఉంటుంది. సన్నని డిస్‌ప్లే బెజెల్స్‌తో స్పెషల్ ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్‌తో వస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, డిజైన్‌కు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ లాంచ్ ఎప్పుడంటే? :
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫోన్ జూలై 15న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఆ తర్వాత ఈ ఫోన్ మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, దేశవ్యాప్తంగా మెయిన్ రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ పర్ఫార్మెన్స్, డిస్‌ప్లేకు సంబంధించి అధికారిక క్యాంపెయిన్ టీజర్‌లు వివరాలను వెల్లడించాయి. మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్‌లో 7000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 మొబైల్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. హై పర్ఫార్మెన్స్ టాస్క్, మెరుగైన ప్రాసెసింగ్ కోసం ఫ్లాగ్‌షిప్ హార్డ్‌వేర్‌గా వస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్‌లో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. బ్రాండ్ కనెక్టివిటీ ఎకోసిస్టమ్‌లో కీలక డిజైన్ మార్పు ఉండనుంది.
హార్డ్‌వేర్‌కు సపోర్టు కోసం ఇందులో భారీ బ్యాటరీ ఉంటుందని అంచనా. అలాగే, లైట్ బ్లూ, సేజ్ గ్రీన్ వంటి అనేక కలర్ ఆప్షన్లలో వస్తుంది. రియర్ ప్యానెల్‌లో బ్యాక్‌ప్లేట్‌పై స్పెషల్ షేప్ ట్రిపుల్-కెమెరా మాడ్యూల్ ఉండొచ్చు.
