Motorola Signature Price : ఆఫర్ అదిరింది బ్రో.. ఈ మోటోరోలా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడు కొనాలా? వద్దా?

Motorola Signature Price : మీరు మోటోరోలా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కొంటున్నారా? ప్రస్తుతం మోటోరోలా సిగ్నేచర్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. ఇలా కొన్నారంటే మీ బడ్జెట్ ధరలోనే ఇంటికి తెచ్చుకోవచ్చు.

1/7
Motorola Signature Price : కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కోసంచూస్తున్నారా? మోటోరోలా లవర్స్ అయితే ఇది మీకోసమే.. ప్రస్తుతం మోటోరోలా సిగ్నేచర్‌ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఇలా కొన్నారంటే చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ సిగ్నేచర్ మోడల్ ఆక్టా కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
2/7
ఇందులో బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5,200mAh బ్యాటరీ కూడా అమర్చారు. 90W వైర్డ్ 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మోటోరోలా సిగ్నేచర్‌పై డిస్కౌంట్లు, ఆఫర్లకు సంబంధించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
మోటోరోలా సిగ్నేచర్ ధర : మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే రూ.5,375 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత అసలు ధర రూ.54,624 అవుతుంది.
4/7
అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది బెనిఫిట్స్, ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత ఫోన్‌‌పై రూ.46,600 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు.
5/7
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : మోటోరోలా సిగ్నేచర్‌లో 1264x2780 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్ 6,200 నిట్స్, టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.8-అంగుళాల సూపర్ హెచ్‌డీ ఎల్టీపీఓ ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది.
6/7
కెమెరా సెటప్ పరంగా ఈ సిగ్నేచర్‌లో బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
7/7
కొలతలను పరిశీలిస్తే.. మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ 162.1 మిమీ పొడవు, 76.4 మిమీ వెడల్పు, 6.99 మిమీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 5,200mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.