Redmi Note 14 Pro : రెడ్‌మి ఫ్యాన్స్‌కు పండగే.. ఈ రెడ్‌మి నోట్ 14 ప్రో ఇప్పుడు చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!
Redmi Note 14 Pro : రెడ్‌మి ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ధర ఏకంగా రూ. 5వేలకు పైగా తగ్గింపు పొందింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- May 19, 2026 / 11:19 AM IST
Redmi Note 14 Pro : కొత్త రెడ్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? రెడ్‌మి నోట్ 14 ప్రో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. అయితే, కొనుగోలుదారులు బ్యాంక్, కార్డ్ ఆఫర్లతో అసలు ధర కన్నా ఇంకా తగ్గించుకోవచ్చు.
ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో డీల్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రెడ్‌మి నోట్ 14 ప్రో ఫ్లిప్‌కార్ట్ డీల్ : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో రూ. 23,999 ధరకు లభిస్తోంది. అసలు ధర రూ. 28,999 కన్నా రూ. 5వేలు తక్కువ. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు మరో రూ. 1,200 ఆదా చేసుకోవచ్చు. ఫైనల్ ధర రూ. 22,799 అవుతుంది.
ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రవేశపెట్టింది. తద్వారా మీ పాత డివైజ్‌లను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా రూ. 17వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే, పాత డివైజ్ కండిషన్, మేక్, మోడల్ ఆధారంగా కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఈఎంఐలో చెల్లించే కస్టమర్ల కోసం (24 నెలల ఈఎంఐ) నెలకు రూ. 1,128 నుంచి నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది.
రెడ్‌మి నోట్ 14 ప్రో కొనాలా? వద్దా? : రెడ్‌మి నోట్ 14 ప్రో ఫోన్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3 రియర్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి.
ఈ రెడ్‌మి ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5,500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3 కెమెరాల సెటప్ ఉంది.
ఇందులో క్లియర్ ఫొటోల కోసం 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, మాక్రో షూటింగ్ కోసం 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌తో 5,500mAh బ్యాటరీ కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
