Redmi Note 17 Pro Series : బ్యాటరీ బీస్ట్ వస్తోందోచ్.. ఈ కొత్త రెడ్‍మి 17 ప్రో సిరీస్ రేంజ్ ఇదే.. లాంచ్ డేట్ ఫిక్స్..!

Redmi Note 17 Pro Series : రెడ్‌మి నుంచి సరికొత్త ప్రో సిరీస్ వస్తోంది.. 10,000 భారీ బ్యాటరీతో ఈ నెల 15న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ప్రో సిరీస్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..

  • Published on- September 13, 2026 / 05:07 PM IST
1/7
Redmi Note 17 Pro Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి నోట్ 17 ప్రో సిరీస్ సెప్టెంబర్ 15న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈసారి కంపెనీ బ్యాటరీ లైఫ్‌పై మెయిన్ ఫోకస్ పెడుతోంది. ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 17 ప్రో, రెడ్‌మి నోట్ 17 ప్రో మాక్స్ అనే 2 స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయని అంచనా. ప్రో మాక్స్ మోడల్‌పై ముఖ్యంగా భారీ 10,000mAh బ్యాటరీ ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్లలో ఏయే పీచర్లు ఉండొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
2/7
భారత్ లాంచ్ తేదీ : రెడ్‌మి నోట్ 17 ప్రో సిరీస్ సెప్టెంబర్ 15న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ 2 స్మార్ట్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్‌లు షావోమీ ఆన్‌లైన్ స్టోర్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కూడా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. షావోమీ ఇప్పటికే భారత మార్కెట్లో స్టాండర్డ్ రెడ్‌మి నోట్ 17 మోడల్‌ను లాంచ్ చేసింది.
3/7
10,000mAh బ్యాటరీ : రెడ్‌మి నోట్ 17 ప్రో సిరీస్‌లో బ్యాటరీయే మెయిన్ అట్రాక్షన్. ముఖ్యంగా, రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్‌లో 10,000mAh బ్యాటరీని అమర్చనున్నట్లు అంచనా. కంపెనీ ప్రకారం.. ప్రో మ్యాక్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 రోజులకు పైగా బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అయితే, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, కెమెరా వాడకం, మొబైల్ డేటా వంటి అధిక వినియోగంతో ఈ బ్యాటరీ లైఫ్ తగ్గే అవకాశం ఉంది.
4/7
ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌, వైడ్ రేంజ్ రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ రెండు చిప్‌సెట్‌లు సోషల్ మీడియా, వెబ్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్ మల్టీటాస్కింగ్ వంటి రోజువారీ టాస్కులకు అద్భుతంగా ఉంటుంది.
5/7
బిల్డ్ క్వాలిటీ : రెడ్‌మి నోట్ 17 ప్రో సిరీస్ కేవలం బ్యాటరీ మాత్రమే కాదు.. కంపెనీ టీజర్‌ల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో రానున్నాయి. అంతేకాదు.. ఈ ఫోన్‌లు TÜV SÜD 5-స్టార్ టైటాన్ క్వాలిటీ సర్టిఫికేషన్‌ అందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండస్ట్రీలోనే ఫస్ట్ ఫోన్ అని కంపెనీ అంటోంది.
6/7
డిజైన్, కలర్ ఆప్షన్లు : డిజైన్ పరంగా చూస్తే.. రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉండొచ్చు. కంపెనీ 'సీక్రెట్ సన్‌రైజ్' కలర్ వేరియంట్‌ను కూడా ఇప్పటికే ఆవిష్కరించింది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో వాడిన ఫోటోక్రోమిక్ మెటీరియల్ లైటింగ్ పడగానే దానికి తగినట్టుగా కలర్ కూడా మారిపోతుంది.
7/7
బ్యాక్ డిజైన్‌లో క్లౌడ్, సన్ రైజ్ మాదిరి డిజైన్ ఉంది. ఇతర స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫోన్‌కు స్పెషల్ లుక్ అందిస్తుంది. రెడ్‌మి నోట్ 17 ప్రో ఇలాంటి డిజైన్‌తోనే వస్తోంది. లావెండర్ కలర్ వేరియంట్లలో లాంచ్ కానున్నట్లు కంపెనీ రివీల్ చేసింది. అయితే, ఫైనల్, ధర పూర్తి స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తిగా వెల్లడి కాలేదు.