Samsung Galaxy A35 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఈ శాంసంగ్ 5G ఫోన్ సగం ధరకే.. ఎందుకు కొనాలంటే?
Samsung Galaxy A35 : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14వేలు తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ ఎ35 ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- June 18, 2026 / 01:43 PM IST
Samsung Galaxy A35 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ భారీగా తగ్గింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 32,999 ధరతో మార్కెట్లోకి రాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14వేలకు పైగా తగ్గింపుతో అమ్ముడవుతోంది.
అంతేకాదు.. బ్యాంక్ కార్డు ఆఫర్లతో అసలు ధర నుంచి ఇంకా తగ్గుతుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A35 ఫోన్ రూ. 32,999 ధరతో వస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ ఫోన్ కేవలం రూ. 18,999కే లభిస్తోంది. అంటే నేరుగా రూ. 14వేలు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 950 తగ్గింపు పొందవచ్చు. ఫైనల్ ధర రూ. 18,049కి తగ్గుతుంది.
36 నెలల్లో నెలకు కేవలం రూ. 668కే ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. అంతేకాదు.. పాత ఫోన్ అప్‌గ్రేడ్ కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఈ ఫోన్ బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ. 13,250 వరకు పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A35 కొనాలా వద్దా? :
శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 1,900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. అడ్రినో 710 జీపీయూతో వస్తుంది. ఇందులో 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 6 జనరేషన్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లతో పాటు 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో షూటర్‌తో ట్రిపుల్ రియర్-కెమెరా సెటప్ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరాతో వస్తుంది. రూ. 20వేల లోపు ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు.
