Samsung Galaxy A36 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!

Samsung Galaxy A36 5G : శాంసంగ్ మిడ్-రేంజ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A36 5Gని గత మార్చిలో లాంచ్ చేసింది. ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/7
Samsung Galaxy A36 5G : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A36 5G అతి చౌకైన ధరకే లభిస్తోంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్, ధర డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో సరసమైన ధరకు లభిస్తోంది.
2/7
ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A36 5జీ డిస్కౌంట్లు, ధర, స్పెసిఫికేషన్లతో ఇప్పుడు వివరంగా చూద్దాం..
3/7
శాంసంగ్ గెలాక్సీ ఎ36 5జీ డిస్కౌంట్, ఆఫర్లు : శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,495 ధరకు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ.1,375 తగ్గింపు అందిస్తుంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 26,120కు లభిస్తోంది. గత ఏడాది మార్చిలో రూ. 32,999 ధరకు లాంచ్ కాగా, ఇప్పుడు రూ. 6,879 తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.
4/7
శాంసంగ్ గెలాక్సీ ఎ36 5జీ స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ 2340x1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లు వరుసగా రూ. 31,999, రూ. 34,999 ధరకు అందుబాటులో ఉన్నాయి.
5/7
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67-రేటింగ్‌ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతుంది.
6/7
యాక్సిలరోమీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గైరో సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సింగ్‌ అందిస్తుంది. బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 5MP మాక్రో కెమెరా ఉన్నాయి.
7/7
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం శాంసంగ్ గెలాక్సీ ఎ36 5జీలో ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, NFC, ఒక USB టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ పొడవు 162.9 మి.మీ, వెడల్పు 78.2 మి.మీ, మందం 7.4 మి.మీ, బరువు 196 గ్రాములు ఉంటుంది.