Samsung Galaxy A36 Price : ఏంది మావా ఆఫర్.. ఈ శాంసంగ్ ఫోన్ ఇంత తక్కువా? అమెజాన్‌లో డీల్ మిస్ కావొద్దు..!

Samsung Galaxy A36 Price : శాంసంగ్ ఫోన్ ధర భారీగా తగ్గింది.. శాంసంగ్ గెలాక్సీ ఎ36 ఫోన్ రూ. 4వేలు డిస్కౌంట్‌తో లభిస్తోంది. అమెజాన్‌లో ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/7
Samsung Galaxy A36 Price : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి బంపర్ ఆఫర్.. మంచి బ్యాటరీ లైఫ్, అద్భుతమైన కెమెరా సెటప్, అడ్వాన్స్ డిజైన్‌ అందించే కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 32,999 ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది.
2/7
ఈ డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ కార్డు ఆఫర్లతో ఇంకా ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. లిమిటెడ్ టైమ్ ఆఫర్ త్వరలో ముగియనుంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 5జీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
అమెజాన్‌లో అదిరే డీల్ : శాంసంగ్ గెలాక్సీ A36 ప్రారంభ ధర రూ. 32,999 కాగా ఇప్పుడు ధర రూ. 3,100 తగ్గింది. ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ. 29,899కే అమ్ముడవుతోంది. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 1,500 డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
4/7
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో నెలకు కేవలం రూ. 1,051 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లతో కొనేసుకోవచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్‌తో అప్‌గ్రేడ్ చేసుకుంటే డివైస్ బ్రాండ్ మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి రూ. 27,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందొచ్చు.
5/7
ఈ ఫోన్ కొనాలా? వద్దా? : శాంసంగ్ గెలాక్సీ ఎ36 5జీ ఫోన్ అడ్రినో 710 జీపీయూతో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 (6nm) చిప్‌సెట్‌తో వస్తుంది. అంతేకాదు.. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. కంపెనీ 6 జనరేషన్ ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.
6/7
ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది. బయట వాడితే 1,900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందుకోగలదు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది. 45W ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.
7/7
కెమెరా పరంగా పరిశీలిస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం ఫ్రంట్ సైడ్ 12MP సెన్సార్ కూడా ఉంది. ఇప్పుడు అసలే ఫోన్ల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ధర తక్కువలో లభిస్తే అసలు వదులుకోవద్దు..