Flipkart Freedom Sale : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఎంత తగ్గిందంటే?

Flipkart Freedom Sale : ఇండిపెండెన్స్ సందర్భంగా సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

1/6
Flipkart Freedom Sale : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ సందర్భంగా ఫ్రీడమ్ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్ సమయంలో అనేక ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు రూ. 30వేల లోపు కొత్త ఫోన్ కొనేందుకు చూస్తుంటే శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ ఫోన్ అదిరిపోయే ఆప్షన్.
2/6
ఈ శాంసంగ్ ఫోన్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు ధరకే లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి ఆఫర్లపై ఓసారి లుక్కేయండి..
3/6
ధర, ఆఫర్లు : శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,999 ధరకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ.2,225 డిస్కౌంట్ అందిస్తోంది. అసలు ధర రూ. 32,774కు తగ్గుతుంది. అయితే, పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా ధర రూ. 33,200 వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
4/6
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5పై రన్ అవుతుంది. శాంసంగ్ 6 ఏళ్ల OS అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.
5/6
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. సర్కిల్ టు సెర్చ్, జెమిని వాయిస్ అసిస్టెంట్, ఏఐ వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్, డైరెక్ట్ వాయిస్‌మెయిల్ నౌ బార్ వంటి అనేక గెలాక్సీ ఏఐ ఫీచర్లతో కూడా వస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 5MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.
6/6
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 24 గంటలకు పైగా యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్, 8 గంటలకు పైగా గేమింగ్ లేదా 12 గంటల వరకు సోషల్ మీడియా స్క్రోలింగ్ అందిస్తుంది.