Samsung Galaxy S24 5G : శాంసంగ్ లవర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఈ గెలాక్సీ 5G ఫోన్‌పై ఏకంగా రూ. 27వేలు డిస్కౌంట్..!
Samsung Galaxy S24 5G : శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ ఫోన్ అదిరిపోయే ఆఫర్లతో లభిస్తోంది. అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- May 31, 2026 / 11:23 AM IST
Samsung Galaxy S24 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్ కొనేవారికి అద్భుతమైన డీల్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ 33శాతం తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు. 4000mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 5జీపై అదిరిపోయే ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లకు సంబంధించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ధర తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్ లభిస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 74,999 ధరకు లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం రూ. 49,999కే లభిస్తోంది. లాంచ్ దగ్గర నుంచి ఇదే అత్యంత తక్కువ ధర. ఈ ఫోన్‌పై అసలు ధర నుంచి నేరుగా రూ. 20వేలు తగ్గింపు లభిస్తోంది. కంపెనీ బ్యాంక్ ఆఫర్లతో అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ బ్యాంక్ డిస్కౌంట్ :
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్ బ్యాంక్ ఆఫర్లతో పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2,500 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ రూ. 27,500 వరకు తక్కువకు కొనేసుకోవచ్చు. తద్వారా ధర రూ. 47,999కు కొనేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ శాంసంగ్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4000mAh బ్యాటరీ అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
