Samsung Galaxy S25 5G : వారెవ్వా.. శాంసంగ్ ఆఫర్ అదిరింది.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!

Samsung Galaxy S25 5G : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 24వేలు తక్కువకే లభిస్తోంది. పూర్తి ఆఫర్ల వివరాలివే..

1/8
Samsung Galaxy S25 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఫ్లాగ్‌షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 4,000mAh బ్యాటరీతో ఈ ఫోన్‌ కొనాలని అనుకుంటే ఇప్పుడే బెస్ట్ టైమ్.
2/8
శాంసంగ్ గెలాక్సీ S25 5జీలో 50MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 5జీ డిస్కౌంట్లు, ధర, స్పెసిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి..
3/8
ధర, ఆఫర్లు : శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 56,999 ధరకు లభిస్తోంది. జనవరి 2025లో రూ. 80,999 ధరకు లాంచ్ కాగా బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 2850 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ. 54,149కు తగ్గుతుంది.
4/8
మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ధరను రూ. 40,300 వరకు తగ్గుతుంది. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధర కన్నా సుమారు రూ. 24వేలు తక్కువకే అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ 6.2-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1080x2340 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, టాప్ బ్రైట్‌నెస్ 2600 నిట్స్ అందిస్తుంది.
5/8
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ 6.2-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1080x2340 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, టాప్ బ్రైట్‌నెస్ 2600 నిట్స్ అందిస్తుంది.
6/8
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ 4,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
7/8
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. : శాంసంగ్ గెలాక్సీ S25 5జీ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 10MP అల్ట్రావైడ్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
8/8
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్-సిమ్ సపోర్ట్, USB టైప్-C 3.2 పోర్ట్ ఉన్నాయి. కొలతల విషయానికి వస్తే.. పొడవు 146.9 మి.మీ, వెడల్పు 70.5 మి.మీ, మందం 7.2 మి.మీ., బరువు 162 గ్రాములు ఉంటుంది.