Samsung Galaxy S25 Price : బాబోయ్.. ఈ శాంసంగ్ ఫోన్ ఏకంగా రూ. 12వేలు పెరిగింది.. కొత్త ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
Samsung Galaxy S25 Price : శాంసంగ్ గెలాక్సీ S25 ధర రూ.12వేలు పెరిగింది. ఈ శాంసంగ్ ఫోన్ ప్రారంభ ధర కన్నా ఎక్కువ ధరకే లభ్యమవుతోంది.. శాంసంగ్ ఫోన్ కొనాలా? వద్దా మీరే డిసైడ్ చేసుకోండి..
- Sreehari A
- Published on- August 20, 2026 / 03:47 PM IST
Samsung Galaxy S25 Price : శాంసంగ్ ఫోన్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S25 ధర భారీగా పెరిగింది. గత ఏడాది లాంచ్ అయిన శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు రూ.12వేల వరకు ధరకు లభిస్తోంది.
ఈ ఫోన్ ధర దాదాపు గెలాక్సీ S26 ధరకు సమానంగా ఉంటుంది. ఈ శాంసంగ్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. అదనంగా, ఈ ఫోన్‌లో గూగుల్ జెమిని ఆధారిత గెలాక్సీ ఏఐ కూడా ఉంటుంది. శాంసంగ్ ఫోన్ ఎంత పెరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ ఫోన్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.4వేలు పెరిగింది. ధర పెంపుతో ఈ ఫోన్ ఇప్పుడు రూ.83,999కి లభ్యమవుతుంది. అయితే, గత లిస్టు ధర రూ.80,999 కాగా, ఇప్పుడు రూ.84,999కి పెరిగింది. ఇదిలా ఉండగా, 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ.12వేలు పెరిగింది.
అసలు ధర రూ.91,999 ఉండగా ఇప్పుడు ఈ వేరియంట్ రూ.1,03,999కు లభిస్తుంది. లిస్టు ధర రూ.92,999 కాగా, ఇప్పుడు రూ.1,04,999కి పెరిగింది. ఇటీవలే ఈ శాంసంగ్ ఫోన్ అమెజాన్‌లో రూ.65వేలు ప్రారంభ ధరతో లిస్ట్ అయింది.
టిప్‌స్టర్ ప్రకారం.. ఈ శాంసంగ్ ఫోన్ ధర పెరిగింది. అయితే, ఈ ఏడాది శాంసంగ్ ఫోన్ల ధరలు పెరగడం ఇదే మొదటిసారి కాదు. గెలాక్సీ M47 5జీ కూడా లాంచ్ అయిన కొద్ది రోజులకే ధర పెరిగింది.
అంతేకాదు.. ఈ ఏడాదిలో లాంచ్ అయిన అన్ని మోడళ్లు ఇప్పుడు ప్రారంభ ధరల కన్నా ఎక్కువ ధరకే లభిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం.. మెమరీ చిప్‌సెట్‌ల ధరలు పెరగడమే. ఇంకా, ఇతర స్పేర్ పార్టులు కూడా ఖరీదైనవిగా మారుతున్నాయి. తద్వారా ఫోన్ల ధరలపై నేరుగా ఎఫెక్ట్ పడుతోంది.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ జనవరి 2025లో లాంచ్ కాగా 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.2-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే అందిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, గెలాక్సీ ఎక్సినోస్ 2500 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్ 512GB స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OneUI8పై రన్ అవుతుంది.
బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంది. 50MP మెయిన్ OIS కెమెరాతో 12MP అల్ట్రా-వైడ్ 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీలు వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 4,000mAh బ్యాటరీ ఉంది. 25W వైర్డ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. IP68 రేటింగ్‌తో వాటర్ డస్ట్‌ప్రూఫ్ అందిస్తుంది.
