Samsung Galaxy S25 Ultra : దిమ్మతిరిగే ఆఫర్.. శాంసంగ్ అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో రూ. 30వేలు డిస్కౌంట్!
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ ధర తగ్గింది. ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్ ధర అమెజాన్‌లో రూ. 30వేలు ధర తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- August 22, 2026 / 12:33 PM IST
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. ఒకవైపు ఫోన్ల ధరలు పెరుగుతుంటే పాత శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర భారీగా తగ్గింది. శాంసంగ్ ఫోన్ కావాలంటే ఇప్పుడు కొనేసుకోవడమే బెటర్. గత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ గెలాక్సీ S25 ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ధర తగ్గింపు, బ్యాంక్ కార్డు ఆఫర్లతో స్మార్ట్‌ఫోన్ ఇంకా తగ్గించుకోవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. అంతేకాదు.. బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్ డీల్ అదుర్స్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా రూ. 129,999 ధరతో లాంచ్ అయింది. కానీ, అమెజాన్ ప్రస్తుతం కేవలం రూ. 94,999కే అందిస్తోంది. రూ. 35వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ప్రైమ్ మెంబర్లు అదనంగా 5 శాతం ఆదా చేసుకోవచ్చు. అయితే, ప్రైమ్ మెంబర్లు కాని యూజర్లు కూడా 3 శాతం మంచి అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
నెలకు కేవలం రూ. 3,340 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా అందిస్తోంది. అప్‌గ్రేడ్ కోసం చూస్తుంటే అమెజాన్‌లోని ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా ఎంచుకోవచ్చు. మీ పాత మోడల్, బ్రాండ్ మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి రూ. 33,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. ఈ ఆఫర్లు లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఇప్పుడే కొనాలా? వద్దా? :
ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌సెట్‌ల కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీని ప్రభావం శాంసంగ్ S25 సిరీస్‌పై కూడా పడింది. ఎందుకంటే.. ఇటీవలే శాంసంగ్ గెలాక్సీ S25 మోడల్‌లోని కొన్ని వేరియంట్ల ధరలు పెరిగాయి.
కానీ, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై ప్రస్తుత ధర భారీగా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.9-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పాటు 12GB వరకు ర్యామ్ 1TB స్టోరేజ్ ఉన్నాయి. గేమింగ్ లేదా మల్టీటాస్కింగ్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. అంతేకాదు.. మీకు ఏఐ-ఆధారిత ఫంక్షనాలిటీలను కూడా అందిస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్, 10MP 3x టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ శాంసంగ్ ఫోన్ 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, మంచి కెమెరాలు లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ కూడా పొందవచ్చు.
