Samsung Galaxy S26 Ultra : లక్ష ఖరీదైన శాంసంగ్ అల్ట్రా ఫోన్.. అమెజాన్‌లో భారీగా తగ్గిందోచ్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 20వేల తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/9
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి. అత్యంత ఖరీదైన శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు సరసమైన ధరకే లభిస్తోంది. కొత్త ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తుంటే మీ కోసం అమెజాన్ అద్భుతమైన డీల్‌ అందిస్తోంది.
2/9
ఇటీవలే లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఇప్పుడు ఏకంగా రూ. 20వేలు తగ్గింపుతో లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 లాంచ్‌కు ముందే ఈ లగ్జరీ ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు.
3/9
అయితే, ఈ అల్ట్రాలో కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్లు, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, క్వాడ్ కెమెరా సెటప్, కెమెరా డిజైన్ వంటి ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంతకీ మీ బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లభిస్తుందా? కొనాలా? వద్దా? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/9
అమెజాన్‌లో భారీగా తగ్గిన అల్ట్రా ధర : శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా ఫోన్ రూ. 1,39,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు అమెజాన్‌లో రూ. 1,19,480 ధరకు లభిస్తోంది. ఎలాంటి కార్డులు లేకుండా ఈ కొత్త ఫోన్ రూ. 20వేలకు పైగా సేవ్ చేసుకోవచ్చు.
5/9
మీ వద్ద అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం ఈ శాంసంగ్ ఫోన్ రూ. 3,500పైగా ఆదా చేసుకోవచ్చు. దాంతో అసలు ధర నుంచి రూ. 1,16,000 కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
6/9
మీరు ఈ శాంసంగ్ ఫోన్ నెలకు రూ. 4,201 నుంచి ఈఎంఐతో కొనేసుకోవచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ. 38,950 వరకు వాల్యూ పొందవచ్చు. అదనంగా ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లను కూడా తీసుకోవచ్చు.
7/9
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కొనాలా? : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ మార్కెట్లో దొరికే మోస్ట్ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, వరల్డ్ ఫస్ట్ ప్రైవసీ డిస్‌ప్లేతో వస్తుంది. విశాలమైన ఎఫ్/1.4 అపర్చర్‌తో 200MP మెయిన్ కెమెరా, 60W వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది.
8/9
అలాగే, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ కూడా ఉంది. 6.9-అంగుళాల భారీ సైజు ఉన్నా ఫోన్ చూసేందుకు చాలా సన్నగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
9/9
ఈ కొత్త వెర్షన్‌లో ఎస్ పెన్ బ్లూటూత్ ఆధారిత రిమోట్ జెస్చర్ ఫంక్షనాలిటీ లేదు. ఫ్లాగ్‌షిప్ ధర వద్ద Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్ అలైన్‌మెంట్ కూడా ఇందులో లేదు. శాంసంగ్ అల్ట్రా ఫోన్ కొనేముందు ఈ ఫీచర్ల విషయంలో ఆలోచించాల్సిందే..