Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ అదిరే ఆఫర్.. లగ్జరీ ఫోన్ ఇప్పుడు బడ్జెట్ రేట్‌లో..!
Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ ఫ్యాన్స్ మీకోసమే.. గెలాక్సీ జెడ్ 8 అతి త్వరలో లాంచ్ కానుంది. అంతకన్న ముందే పాత గెలాక్సీ ఫోన్ తో ఎక్స్ంజ్ చేసుకుంటే ఇంకా చవకైన ధరకే లభిస్తుంది.
- Sreehari A
- Updated on- July 16, 2026 / 01:44 PM IST
Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ నెక్ట్స్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జూలై 22న జరుగనుంది. ఈ లాంచ్ సమయంలో నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ప్రతి ఏడాదిలో ఈ కంపెనీ రెండు ఫోల్డబుల్స్‌ను లాంచ్ చేస్తుంది. అందులో ఒకటి బుక్ షేప్ ఫోల్డబుల్ ఫోన్, మరొకటి ఫ్లిప్ ఆకారంలో ఫోన్ ఉంటుంది.
ఈ ఏడాదిలో శాంసంగ్ తన వ్యూహాన్ని మార్చుకుంది. రెండు ఫోన్లకు బదులుగా 3 ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌కు ముందు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఆన్‌లైన్‌లో రూ. 7వేల తగ్గింపుతో లభిస్తోంది. మీరు ఈ అద్భుతమైన డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫోన్ రూ. 1,74,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేస్తే విజయ్ సేల్స్ రూ. 7వేలు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్‌సీ బ్యాంక్, బీఓబీ కార్డ్ బ్యాంక్ లేదా వన్‌కార్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ ధరకే ఫోన్ కొనేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్పెసిఫికేషన్లు ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల బయటి డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు 8-అంగుళాల లోపలి స్క్రీన్ ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీ ఉంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో 200ఎంపీ ప్రైమరీ కెమెరా స్పెషల్ అట్రాక్షన్ కాగా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్, 30x వరకు డిజిటల్ జూమ్‌తో 10ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ కవర్ లోపలి డిస్‌ప్లేలు రెండింటిపైనా 10ఎంపీ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
ఈ ఫోన్ కొనాలా? వద్దా? :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఫోన్ సన్నని లైట్ వెయిట్ డిజైన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 200ఎంపీ మెయిన్ కెమెరా కూడా ఉంది.
ధర విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోల్డ్ 7 ఫోన్ రూ. 1,68,000కే కొనేసుకోవచ్చు. వచ్చే వారం శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 లాంచ్ చేయనుంది. ఆ సమయంలో ఈ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ధర మరింత తగ్గే అవకాశం ఉంది. మీరు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 కొనాలని చూస్తుంటే.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 లాంచ్ లేదా ఏదైనా మెగా సేల్ ఈవెంట్ వరకు వెయిట్ చేయడమే బెటర్.
