Shanmukh Jaswanth Wedding : పెళ్లి చేసుకున్న‌ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్.. ఫోటోలు వైర‌ల్‌..

Shanmukh Jaswanth wedding : బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ పెళ్లి చేసుకున్నాడు.

1/7
బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఓ ఇంటి వాడు అయ్యాడు. త‌న ప్రియురాలు వైష్ణవి చోడిశెట్టి మెడ‌లో మూడు ముళ్లు వేశాడు.
2/7
కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల స‌మక్షంలో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్, వైష్ణ‌వి చోడిశెట్టి పెళ్లి జ‌రిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. కొత్త జంట‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.
3/7
వైజాగ్‌కి చెందిన ష‌ణ్ముఖ్ జ‌స్మంత్ యూట్యూబ‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. వైవా షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు.
4/7
ఆ త‌రువాత ప‌లు చిత్రాల్లో స‌హాయ పాత్రలు చేశాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొని ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు.
5/7
ఇక ఈ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత అప్ప‌టికే ప్రేమ‌లో ఉన్న యూట్యూబ‌ర్ దీప్తి సునైనాతో విడిపోయాడు.
6/7
ఆ త‌రువాత కొన్నాళ్లకు రాజ‌మండ్రికి చెందిన వైష్ణ‌వి చోడిశెట్టితో ప్రేమ‌లో ప‌డ్డాడు.
7/7
ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రితో వీరు నిశ్చితార్థం చేసుకోగా తాజాగా పెళ్లి చేసుకున్నారు.