Telugu » Photo-gallery » Taiwanese Hair Growth Serum Does This Game Changer Serum Regrow Hair In 20 Days Mz
బట్టతల బాబులకు బంగారం లాంటి న్యూస్.. మీ పంట పండింది పో.. కొత్త సర్వేలో హెయిర్ గ్రోత్.. జస్ట్..
Taiwanese Hair Growth Serum: తైవాన్‌లోని నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన సీరమ్‌ను తయారు చేశారు. దీన్ని చర్మంపై రాస్తే, కొన్ని వారాల్లోనే మళ్లీ జుట్టు పెరిగిందని పరిశోధనలో తెలిసింది. ఈ సీరమ్ తల చర్మంలోని కొవ్వు కణాలను పనిచేసేలా చేసి, జుట్టు మూలాలను మళ్లీ పుట్టించే శక్తిని కలిగి ఉందని ల్యాబ్‌లో పరీక్షలు చూపించాయి. భవిష్యత్తులో జుట్టు రాలడాన్ని ఆపే చికిత్సలను ఇది పూర్తిగా మార్చేస్తుందని అనుకుంటున్నారు.
జుట్టు రాలడం ఆపి, 20 రోజుల్లో కొత్త జుట్టు పెంచుతుందనే కొత్త సీరమ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
2/12
ఈ ఆవిష్కరణ జుట్టు రాలడం సమస్య ఉన్నవారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది.
3/12
తైవాన్‌లోని నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ వినూత్న సీరమ్‌ను అభివృద్ధి చేశారు.
4/12
ఈ సీరమ్ ఎలుకలపై పరీక్షించగా, కొన్ని వారాల్లోనే వాటికి మళ్లీ జుట్టు పెరిగింది.
5/12
ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో జుట్టు రాలడం నివారించే చికిత్సలను మార్చే అవకాశం ఉంది.
6/12
ఈ సీరమ్ సహజంగా దొరికే కొవ్వు ఆమ్లాలతో (ఫ్యాటీ యాసిడ్స్‌తో) తయారు చేయబడింది.
7/12
ఇది చర్మానికి ఎలాంటి హాని చేయదని, చాలా మృదువుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
8/12
త్వరలోనే ఇది సాధారణంగా మెడికల్ షాపుల్లో దొరికే అవకాశం ఉందని అంచనా.
9/12
అధిక జుట్టు పెరుగుదలకు కారణమయ్యే 'హైపర్‌ట్రైకోసిస్' అనే జీవ ప్రక్రియను బేస్ చేసుకొని ఈ సీరమ్ తయారు చేశారట
10/12
ఒలియిక్, పామిటోలియిక్ ఆమ్లాలు: సీరమ్‌లో ఒలియిక్ ఆసిడ్, పామిటోలియిక్ ఆసిడ్ వంటి సహజ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి సురక్షితమైనవి.
11/12
పేటెంట్ దాఖలైంది, ఇప్పుడు మనుషులపై పరీక్షలు జరిపి మోతాదు, భద్రతను నిర్ధారించే పనిలో ఉన్నారు.
12/12
ఈ సమాచారం కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే. దీన్ని వైద్య సలహాగా చూడకూడదు. ఏదైనా ట్రీట్మెంట్ కొరకు లేదా మెడిసిన్ యూజ్ కోసం అయితే ముందు డాక్టర్‌ను తప్పకుండా అడగాలి.