Vivo T5 Launch : బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ బీస్ట్.. 50MP కెమెరా, 7050mAh బ్యాటరీతో ఈ వివో 5G ఫోన్ దుమ్మురేపుతోంది!

Vivo T5 Launch : భారత మార్కెట్లో లాంచ్ అయిన వివో T5 5G ఫోన్ 50MP కెమెరా, 7050mAh బ్యాటరీతో పాటు అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..

1/8
Vivo T5 Launched : వివో లవర్స్‌కు పండగే.. వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో T5 5G వచ్చేసింది. భారత మార్కెట్లో ఈ వివో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
2/8
ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ OS 6.0పై రన్ అవుతుంది. వివో టీ5 5జీ ఫోన్ 7,050mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వివో టీ5 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
3/8
వివో టి5 5జీ ధర : వివో టీ5 5జీ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 34,999, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 39,999, 8GB+2568GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 44,999 12GB+2568GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 49,999గా నిర్ణయించింది.
4/8
లాంచ్ ఆఫర్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు పేమెంట్లపై కంపెనీ రూ. 4వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 9 నుంచి ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రాయల్ బ్రాంజ్ సిల్వర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
5/8
వివో T5 5జీ స్పెసిఫికేషన్లు : వివో టీ5 5జీ ఫోన్ 2800x1260 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 449 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 2000 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్‌నెస్, 3000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్ 8000000:1 కాంట్రాస్ట్ రేషియోతో 6.83-అంగుళాల, 1.6-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
6/8
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ OS 6.0పై రన్ అవుతుంది. వివో T5 5జీ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7,050mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 6GB+8GB+12GB LPDDR4X ర్యామ్, 128GB/256GB UFS3.1 స్టోరేజ్‌తో వస్తుంది. అవసరమైతే ఇందులో ర్యామ్ 12GB వరకు పెంచుకోవచ్చు.
7/8
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వివో టీ5 5జీలో ఎఫ్/1.79 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, OTG, GPS, USB టైప్-C 2.0 ఉన్నాయి.
8/8
కొలతల పరంగా పొడవు 16.442 సెం.మీ, వెడల్పు 7.525 సెం.మీ, మందం 0.799 సెం.మీ, బరువు 199 గ్రాములు ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 IP69 రేటింగ్‌ అందిస్తుంది. 1.5 మీటర్ల నీటిలో 30 నిమిషాల వరకు మునిగినా తట్టుకోగలదు. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ అందించారు.