Vivo T5 Lite 5G : వావ్.. కొత్త వివో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఉన్నాయి భయ్యా, మైండ్ బ్లోయింగ్ అంతే..!

Vivo T5 Lite 5G : వివో T5 లైట్ 5G ఫోన్ వచ్చేస్తోంది. ఈ వివో ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.74-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండొచ్చు.. పూర్తి వివరాలివే..

1/7
Vivo T5 Lite 5G : వివో లవర్స్ కోసం అద్భుతమైన 5జీ ఫోన్ వస్తోంది. మీరు వివో కస్టమర్ అయితే ఇది మీకోసమే.. అతి త్వరలో వివో నుంచి సరికొత్త వివో T5 లైట్ 5G అనే మరో కొత్త ఫోన్‌ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వివో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పలు ఫీచర్లు లీక్ అయ్యాయి.
2/7
లీకుల ప్రకారం.. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.74-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంటుంది. లీక్ డేటా ప్రకారం.. ఈ ఫోన్ ప్రాసెసర్‌గా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ఉండొచ్చు. ఇందులో 4GB + 128GB, 6GB + 128GB, 6GB + 256GB వంటి కొన్ని మెమరీ/స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయి.
3/7
ఈ ఫోన్ 8.39 మి.మీ. మందంతో సుమారు 209 గ్రాముల బరువుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. అయితే, ఈ ఫోన్‌కు సంబంధించి వివో ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
4/7
వివో T5 లైట్ 5G స్పెసిఫికేషన్లు (అంచనా) : ఈ వివో T5 లైట్ 5జీలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ ఎల్‌సీడీ స్క్రీన్ ఉండొచ్చు. అదనంగా, వివో T5 లైట్ 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంటుందని అంచనా. 4GB + 128GB, 6GB + 128GB, 6GB + 256GB అనే 3 వేరియంట్లలో లాంచ్ కావచ్చు.
5/7
వివో T5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ఉండవచ్చు. ఈ ఫోన్ సైజు కూడా 8.39 మిమీతో చాలా సన్నగా ఉంటుంది. బరువు 209 గ్రాములు ఉంటుంది.
6/7
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉండవచ్చు. అదనంగా, సెల్ఫీ ప్రియుల కోసం 5MP ఫ్రంట్-ఫేసింగ్ షూటర్ కూడా ఉంటుందని అంచనా.
7/7
IP65 రేటింగ్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. అంతేకాదు.. వివో T5 లైట్ 5G ట్వైలైట్ షాడో, వేవ్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు. అధికారిక ధర, పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.