Vivo X100 Pro Price : వావ్.. ఏంది భయ్యా ఆఫర్.. ఈ వివో ప్రో ఫోన్ మరి ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్..!

Vivo X100 Pro Price : వివో ఎక్స్100 ప్రో ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో అత్యంత ఖరీదైన ఈ వివో ప్రీమియం ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. అదిరిపోయే డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

1/7
Vivo X100 Pro Price : వివో లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్. అమెజాన్ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. తక్కువ ధరలో మంచి వివో ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తుంటే వివో X100 ప్రో అద్భుతమైన ఆప్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ జైస్-ట్యూన్డ్ కెమెరాలతో వస్తుంది. ఇందులో డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ ఉంది.
2/7
అంతేకాదు.. ఇందులో 5,400mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భారత మార్కెట్లో రూ. 89,999 ధరతో లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. అమెజాన్‌లో వివో X100 ప్రో పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
3/7
వివో X100 ప్రో అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 89,999 ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం కేవలం రూ. 69,999కే ఈ ఫోన్ అమ్ముడవుతోంది. ప్రారంభ ధరపై రూ. 20వేలు నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ వివో ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. అయితే, మీరు నాన్-ప్రైమ్ మెంబర్ అయితే క్యాష్‌బ్యాక్ 3 శాతమే పొందగలరు.
4/7
నెలకు రూ. 2,461 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను కూడా అందిస్తోంది. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే రూ. 40,200 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూతో మార్చుకోవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ ధర మీ పాత ఫోన్, బ్రాండ్ మోడల్, పర్ఫార్మెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
5/7
వివో X100 ప్రో స్పెసిఫికేషన్లు : వివో X100 ప్రో 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌తో వస్తుంది. 16జీబీ వరకు ర్యామ్ 512జీబీ స్టోరేజ్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఓ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్14తో రన్ అవుతుంది.
6/7
పవర్ విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 5,400mAh బ్యాటరీ ఉంది. 100W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో X100 ప్రోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో జీస్-ట్యూన్డ్ 50ఎంపీ సోనీ IMX989 సెన్సార్, 50ఎంపీ వైడ్-యాంగిల్ కెమెరా ఓఐఎస్‌తో 50ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
7/7
ఈ వివో ఫోన్ కొనాలా? వద్దా? : మంచి కెమెరాతో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని చూస్తుంటే వివో X100 ప్రో అద్భుతమైన ఆప్షన్. రూ. 20వేలు తగ్గింపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌లో జైస్ కెమెరాలు, అడ్వాన్స్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్, 120Hz అమోలెడ్ స్క్రీన్ 5,400mAh బ్యాటరీ ఉన్నాయి.