Vivo X200T Price : వివో లవర్స్‌కు పండగే.. ఈ వివో X200T ఫోన్ చాలా చీప్ మావా.. ధర జస్ట్ ఎంతంటే?
Vivo X200T Price : వివో ఫ్యాన్స్ మీకోసమే.. వివో 50ఎంపీ ట్రిపుల్ కెమెరా ఫోన్ ఏకంగా రూ. 6వేలు తక్కువకే లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- July 5, 2026 / 01:11 PM IST
Vivo X200T Price : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో X200T ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్, 6200mAh బ్యాటరీ ఉన్నాయి. 40W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫోన్ రిటైల్ స్టోర్లలో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. వివో ఎక్స్200టీ ఫోన్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భారత్‌లో వివో X200T తగ్గింపు ధర :
వివో X200T ఫోన్ అత్యంత చౌకైన ధరకే లభిస్తోంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో ఈ వివో ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. తద్వారా ధర రూ. 59,999కే కొనేసుకోవచ్చు. ఈ రిటైల్ స్టోర్ ఫోన్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈఎంఐలో వివో ఫోన్ కొంటే రూ. 6వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో వివో ఫోన్ అసలు ధర రూ. 53,999కి తగ్గుతుంది. అంటే.. రూ. 6వేలు తక్కువకే లభిస్తుంది.
వివో X200T స్పెసిఫికేషన్లు :
వివో X200T ఫోన్ 6.67-అంగుళాల కలర్ మాస్టర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1260x2800 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz బ్రైట్‌నెస్ 5,000 నిట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ చిప్‌సెట్‌తో వస్తుంది.
ఇందులో 6,200mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ OS6పై రన్ అవుతుంది. కంపెనీ ఐదేళ్ల OS అప్‌డేట్‌లు ఏడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌తో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వివో X200టీ బ్యాక్ సైడ్ 50ఎంపీ సూపర్ టెలిఫోటో కెమెరా, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, NFC, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. కొలతల పరంగా ఈ ఫోన్ 160 మిమీ పొడవు, 74.2 మిమీ వెడల్పు, 7.9 మిమీ మందం, 203 గ్రాముల బరువు ఉంటుంది.
