Vivo X300 Pro Deal : ఏంది భయ్యా ఆఫర్.. వివో X300 ప్రో మరి ఇంత తక్కువకా? అమెజాన్‌లో జస్ట్..!

Vivo X300 Pro Deal : వివోనా మజాకా.. వివో ఎక్స్300 ప్రో డీల్ అద్భుతంగా ఉంది. అమెజాన్‌లో బ్యాంకు ఆఫర్లతో ఏకంగా రూ. 12వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

1/7
Vivo X300 Pro Deal : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? మీకోసం అద్భుతమైన డీల్.. మంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే ఈ డీల్ మీకోసమే.. వివో X300 ప్రో చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. వివో X300 ప్రో అసలు ధర రూ. 1,19,999 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ. 12వేలు భారీ తగ్గింపుతో లభిస్తోంది.
2/7
6.78-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, 200MP టెలిఫోటో లెన్స్ మరెన్నో ఫీచర్లతో వస్తుంది. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువరోజులు ఉండవు. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
వివో X300 ప్రో డీల్ : భారత మార్కెట్లో వివో X300 ప్రో అధికారిక ధర రూ. 1,19,999కు లభిస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ కొనేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 12,999 డిస్కౌంట్ పొందవచ్చు.
4/7
యాక్సిస్ క్రెడిట్ కార్డ్ లేకున్నా ఐసీఐసీఐ బ్యాంక్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడ్-ఇన్ చేయవచ్చు.
5/7
వివో X300 ప్రో స్పెసిఫికేషన్లు : వివో X300 ప్రోలో 2800 × 1260 (1.5K+) రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కంటెంట్‌ బట్టి రిఫ్రెష్ రేట్‌ను 1Hz నుంచి 120Hz మధ్య అడ్జెస్ట్ చేసే ఎల్టీపీఓ ప్యానెల్ ఉన్నాయి. HDR10+, డాల్బీ విజన్, నెట్‌ఫ్లిక్స్ HDR, SGS లో-బ్లూ లైట్, TUV రైన్‌ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీలకు కూడా సపోర్టు ఇస్తుంది.
6/7
వివో X300 ప్రో లోపల మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ అమర్చారు. అంతేకాదు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,510 mAh బ్యాటరీ కూడా అందిస్తుంది.
7/7
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో X300 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 50MP సోనీ LYT-828 మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ JN1 లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్, OIS, ఎఫ్/2.67 అపర్చర్‌తో 200MP HPB టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉంది.