Vivo X500 Pro Launch : ఫ్లాగ్‌షిప్‌లకు గట్టి పోటీ.. కొత్త వివో X500 ప్రో వస్తోందోచ్.. లీక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

Vivo X500 Pro : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్ ఉండొచ్చు. వివో X500 ప్రోలో మధ్యలో సర్కిల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని అంచనా. పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

1/7
Vivo X500 Pro : వివో లవర్స్ మీకోసమే.. వివో నుంచి సరికొత్త ప్రో ఫోన్ రాబోతుంది. వివో X500 ప్రో లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్ ఉంటుందని అంచనా. గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన వివో X300 ప్రో స్థానంలో వివో ఎక్స్500 ప్రో రాబోతుంది.
2/7
నివేదికల ప్రకారం.. రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్, డిస్‌ప్లే వివరాలు రివీల్ అయ్యాయి. వివో X500 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.37-అంగుళాల ఫ్లాట్ ఎల్టీపీఓ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంజనీరింగ్ శాంపిల్స్‌ను బీఓఈ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో టెస్టింగ్ చేస్తున్నట్టు సమాచారం.
3/7
వివో X500 ప్రోలో ఎల్ఐపీఓ డిస్‌ప్లే ప్యాకేజింగ్‌తో వస్తుందని అంచనా. నాలుగు వైపులా సన్నని బెజెల్స్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్ ఉంటుందని అంచనా. వివో X500 ప్రోలో మధ్యలో సర్కిల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని అంచనా. గతంలో వివో ఎక్స్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరా మాడ్యూల్ ఉండేది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ కానుంది.
4/7
గత ఏడాది డిసెంబర్‌లో భారత మార్కెట్లో వివో X300 ప్రో లాంచ్ కాగా 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే (1,260 × 2,800 పిక్సెల్స్) అందిస్తుంది.
5/7
మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది.
6/7
వివో X300 ప్రో బ్యాక్ సైడ్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP సోనీ LYT-828 ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 200MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
7/7
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,510mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.