iPhone 16 Discount : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 18 ప్రో రాక ముందే ఐఫోన్ 16 భారీగా తగ్గిందోచ్.. ఇదే బెస్ట్ టైమ్!

iPhone 16 Discount : ఆపిల్ ఐఫోన్ 16 భారీగా తగ్గిందోచ్.. ఐఫోన్ 18 ప్రోకు ముందే ఐఫోన్ 16 సరసమైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

1/7
iPhone 16 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? మీరు సరికొత్త ఐఫోన్‌ సరసమైన ధరలో కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ ముందే గత జనరేషన్ ఐఫోన్ 16 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9వేలు తగ్గింపుతో లభిస్తోంది.
2/7
ఈ ఐఫోన్ అసలు ధర సుమారు రూ. 70వేలు కాగా, ప్రస్తుతం సుమారు రూ. 61వేలకే లభిస్తోంది. ఈ ధరకు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, డ్యూయల్ కెమెరా సెటప్ ఓఎల్ఈడీ ప్యానెల్‌ను పొందవచ్చు. ఈ డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర ఎంతంటే? : ఆపిల్ ఐఫోన్ 16 ప్రస్తుత ధర రూ. 67,900 ఉండగా అధికారిక ధరపై రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. అయితే, రూ. 6,245 తగ్గింపు కోసం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ తప్పనిసరి. తద్వారా ధర సుమారు రూ. 61,500కు తగ్గుతుంది. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 40,900 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, బిల్లింగ్ తేదీ, వేరియంట్, పర్ఫార్మెన్స్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
4/7
ఫ్లిప్‌కార్ట్ నెలకు రూ. 5,658 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. అయితే, ప్రాసెసింగ్ ఫీజులు, ఫైల్ ఛార్జీల వంటి కొన్ని హిడెన్ ఛార్జీలు ఉండవచ్చు. మీరు అదనపు మొత్తం చెల్లించి ఆపిల్ కేర్ ప్లస్ కూడా కొనేసుకోవచ్చు.
5/7
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 16లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్, డైనమిక్ ఐలాండ్ బయట గరిష్టంగా 2,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ ఫోన్‌కు అల్యూమినియం ఫ్రేమ్, సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కలర్ ఆప్షన్లు, గ్లాస్ బ్యాక్ ఉన్నాయి. బ్లాక్, వైట్, పింక్, టీల్ అల్ట్రామెరైన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
6/7
ఐఫోన్ 16 లోపల 6-కోర్ CPU, 5-కోర్ జీపీయూ 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో ఆపిల్ A18 చిప్ అమర్చారు. 128GB, 256GB లేదా 512GB స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ అందిస్తుంది.
7/7
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో ఎఫ్/1.6 అపర్చర్ సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48MP ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఈ మెయిన్ కెమెరా 2x ఆప్టికల్-క్వాలిటీ టెలిఫోటో షాట్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ ఫేస్ ఐడీతో 12MP ట్రూడెప్త్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ఆపిల్ కెమెరా కంట్రోల్ యాక్షన్ బటన్ కూడా ఉన్నాయి.