టీడీపీకి చీరాల ఎమ్మెల్యే ఆమంచి గుడ్ బై

  • Publish Date - February 13, 2019 / 04:38 AM IST

తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నట్లు సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. వారం రోజులుగా ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి చర్చించారు. ప్రకాశం జిల్లా నేతలు కూడా ఆమంచిని బుజ్జగించారు. అయినా ఆయన వినలేదు. టీడీపీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానికి అధికారికంగా లేఖ రాశారు.

 
ఆమంచి రాజీనామాతో అలర్ట్ అయ్యింది టీడీపీ. ఎమ్మెల్యే కరణం బలరాంకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. వెంటనే చీరాల కార్యకర్తలు, నేతల సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కార్యకర్తలు, నేతలు ఆమంచి వెంట వెళ్లకుండా చూడాలని సూచించారు. 

ఫిబ్రవరి 12వ తేదీ రాత్రే చీరాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్యే ఆమంచి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ కానున్నారు.