Kavitha: అధికార కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌యే టార్గెట్టా? చర్చనీయాంశంగా మారిన కవిత తీరు..

ఇప్పుడు కవిత డోస్ పెంచి వాయిస్ రేజ్ చేస్తుండటంతో బీఆర్ఎస్ లీడర్లు కూడా తగ్గేదేలే అంటున్నారు.

Kavitha: అధికార కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌యే టార్గెట్టా? చర్చనీయాంశంగా మారిన కవిత తీరు..

Updated On : December 10, 2025 / 9:47 PM IST

Kavitha: అక్క మొదట అలిగినట్లు చేసింది. ఆ తర్వాత రచ్చకెక్కింది. అట్టముక్కతో కొట్టినట్లు చేసి..ఇప్పుడు ఏకంగా బడిత పూజ మొదలు పెడుతోంది. భారీ డైలాగులు పేల్చుతూ ఎవరి గుండెల్లో గునపం దింపాలో దింపేస్తోంది. బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్‌ చేస్తూ గులాబీ దళంలో గుబులు పుట్టిస్తోంది. ఇక చూసి చూసి భరించలేక.. కారు పార్టీ లీడర్లు కూడా ఈట్‌ కా జవాబ్ పత్తర్ సే దేంగే అంటున్నారు. పెద్ద సార్ కూతురని కూడా చూడకుండా నీ వల్లే పార్టీ పుట్టి మునిగిందని రివర్స్ అటాక్ చేస్తున్నారు. కారు వర్సెస్ కవిత ఫైట్ ఎటు వెళ్తోంది? జాగృతి టార్గెట్ బీఆర్ఎస్సేనా? ఇక బీఆర్ఎస్‌కూ జాగృతే టార్గెట్‌గా మారిందా..?

నాన్న దేవుడు. అన్నతో నో ఇష్యూస్.. హరీష్ తోనే అసలు సమస్య అంటూ మొదట్లో ప్రకటన చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న కవిత ప్పుడు జనం బాటలో తన గేర్ మార్చేస్తుంది. రోజురోజుకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను టార్గెట్ చేస్తూ హీట్ పుటిస్తోంది. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాల పర్యటన చేస్తున్న కవిత..ఎక్కడికి వెళ్లినా పదేళ్ల బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతిమయం, అసలు అభివృద్ధి ఏం జరిగింది అనేలా మాట్లాడుతూ వస్తున్నారు.

మొన్నటి వరకు సుతిమెత్తంగా, సున్నితంగా విమర్శిస్తూ వచ్చిన కవిత..ఇప్పుడు ఏకంగా ఒక్కో ఎమ్మెల్యేను, మాజీమంత్రిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు.. కబ్జాలు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. చివరకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి వెళ్లి కూడా బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తుండటం చర్చకు దారితీస్తోంది. ఇదంతా గమనించిన గులాబీ లీడర్లు..కవిత బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తుందని తమపై చేస్తున్న వ్యాఖ్యలకు సైలెంట్ గా ఉంటే ఇంకా వీక్ అయిపోతామనే నిర్ణయానికి వచ్చారట. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అవినీతి చేశారంటూ..ఇండైరెక్టగా గత బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమే అనేలా కవిత ఆరోపిస్తుండటం గులాబీ లీడర్లకు అస్సలు మింగుడు పడటం లేదట. దీంతో కవిత వ్యాఖ్యలకు అంతే స్థాయిలో రియాక్ట్ అవ్వాలని డిసైడ్ అవ్వడమే కాదు.. డైరెక్ట్ ఎటాక్ కు దిగారు.

తగ్గేదేలే అంటున్న బీఆర్ఎస్ నేతలు.. ఎదురు దాడి..

కవిత తను పర్యటిస్తున్న నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా…వారిని పల్లెత్తు మాట అనకుండా తమపైనే విరుచుకుపడటం బీఆర్ఎ్ నేతలకు మింగుడు పడటం లేదు. మొన్నటివరకు కవితపై బీఆర్ఎస్ నేతలు ఆచితూచి అడుగులు వేశారు. ఎంతైనా తమ అధినేత కూతురు కాబట్టి సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు కవిత డోస్ పెంచి వాయిస్ రేజ్ చేస్తుండటంతో బీఆర్ఎస్ లీడర్లు కూడా తగ్గేదేలే అంటున్నారు. మొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి, ఆ తర్వాత మరో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి కవిత ఆరోపణలపై తీవ్రస్థాయిలో ఫైర్ అవ్వగా.. ఇప్పుడు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశారు. కవిత ఏ కేసులో జైలుకు వెళ్లారో మరిచిపోయి ఇలా తమను విమర్శించడం ఏంటని డైరెక్ట్ అటాక్ కు దిగుతున్నారు.

గుట్టు విప్పుతానంటూ కవితకు సీరియస్ వార్నింగ్..

తనపై కవిత ఆరోపణలు చేయడంతో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కవిత చరిత్ర ఏంటో తనకు బాగా తెలుసన్న ఆయన.. ఇంకా ఎక్కువ మాట్లాడితే గుట్టు విప్పుతానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చి పడేశారు. కవిత పెంపుడు కుక్కకు విస్కీ అని పేరు పెట్టుకున్న కవిత.. పదేళ్లలో ఏమేం చేసిందో అంతా తెలుసంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే కవిత బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసినా..గులాబీ లీడర్లు కవితకు కౌంటర్ గా మాట్లాడినా..నువ్వు అవినీతి చేశావంటే నువ్వు దోచుకున్నావంటూ ఆరోపణలు గుప్పించుకోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఈ రెండు వర్గాలు కేసీఆర్ హయాంలో నిర్ణయాలపైనే అలిగేషన్స్ చేసుకుంటుడంతో..ఇండైరెక్ట్ గా గులాబీ బాస్ కు తలనొప్పిగా మారిందన్న టాక్ నడుస్తోంది.

Also Read: ఓటేయడానికి వెళ్తున్నారా.. ఓటర్ కార్డు లేకపోతే ఈ 12 కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లొచ్చు.. అన్నీ ఐడీ ఫ్రూఫ్ కిందే లెక్క..!