Telangana GP Polls-2025 : ఓటేయడానికి వెళ్తున్నారా.. ఓటర్ కార్డు లేకపోతే ఈ 12 కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లొచ్చు.. అన్నీ ఐడీ ఫ్రూఫ్ కిందే లెక్క..!
Telangana GP Polls-2025 : ఓటర్లు పోలింగ్ వద్ద ఓటు వేసే క్రమంలో ఓటర్ ఐడీ కార్డు లేకున్నా ఇతర 13 రకాల గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు..
Telangana GP Polls-2025
Telangana GP Polls-2025 : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ పంచాయతీ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో నిర్వహించనున్నారు. మందుగా తొలి విడత 11వ తేదీ నుంచి మొదలు కానుంది. ఆ తర్వాత రెండో, మూడో విడత జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో 11వ విడత జరగబోయే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఓటర్లందరకూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీరు కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తున్నారా? అయితే ఇది మీకోసమే.. సాధారణంగా ఓటు వేయాలంటే ప్రతిఒక్కరికి ఓటర్ కార్డు ఉండాల్సిందే. లేదంటే ఓటర్ స్లిప్ ఉన్నా పర్వాలేదు. పంచాయతీ పరిధిలో ఓటర్లకు ఇప్పటికే ఓటర్ స్లిప్స్ కూడా అందే ఉంటాయి.
ఒకవేళ మీకు ఓటర్ స్లిప్ అందకపోతే ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి? ఓటర్ స్లిప్ లేకుండా ఓటు వేయలేమా? అసలు ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి? ఓటర్ కార్డు లేని పక్షంలో తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? అనేది ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం..
ఓటర్ ఐడీ లేకుంటే ఏం చేయాలి? :
ఓటింగ్ సమయంలో మీ దగ్గర ఓటర్ ఐడీ లేకుండా కంగారుపడాల్సిన పనిలేదు. అలాగే ఓటర్ స్లిప్ లేకున్నా డోంట్ వర్రీ.. మీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మీకు ఆ ప్రాంతంలో ఓటు ఉంటే చాలు.. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లడం ద్వారా సులభంగా ఓటు వేయొచ్చు. ఎన్నికల పోలింగ్ అధికారులు ప్రధానంగా చెక్ చేసే అంశం.. మీ ఐడెంటిటీ మాత్రమే.. మీకు ఇక్కడ ఓటు ఉందా? లేదా అనేది చూస్తారు. మీరు అందించే ఐడెంటిటీ కార్డు ఆధారంగా వెరిఫై చేస్తారు.
ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటే మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఐడెంటిటీ వెరిఫై కోసం ఎన్నికల సంఘం ఓటర్లకు కొన్ని సడలింపులను ఇచ్చింది. ఓటర్ ఐడీ కార్డ్ మీ వద్ద లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ మాదిరిగా 12 వరకు ఐడెంటిటీ కార్డులను తీసుకెళ్లవచ్చు. ఈ కార్డుల్లో ఏ ఒక్క గుర్తింపు కార్డు చూపించినా మీరు ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఇంతకీ ఏయే డాక్యుమెంట్స్ పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం..
13 గుర్తింపు కార్డులివే :
ఈసీఐ ఓటరు ఐడీ కార్డుతో పాటు ఈ కింది డాక్యుమెంట్లు కూడా అనుమతిస్తారు. ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ప్రత్యేక దివ్యాంగ (UDID) కార్డు, సర్వీస్ గుర్తింపు కార్డు, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్ (కార్మిక మంత్రిత్వ శాఖ), డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) కింద భారత రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, పెన్షన్ పత్రం, MP/MLA/MLCకి జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, MGNREGA జాబ్ కార్డ్ వంటివి కూడా తీసుకెళ్లొచ్చు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో ఓటర్ కార్డు లేని ఈ 13 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి దగ్గర ఉంచుకోవచ్చు.
1) ఓటర్ గుర్తింపు కార్డు
2) ఆధార్ కార్డు
3) M.N.R.E.G.A జాబ్ కార్డు
4) ఫోటోతో బ్యాంక్, పోస్టాఫీస్ పాస్‌బుక్,
5) డ్రైవింగ్ లైసెన్స్
6) హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
7) పాన్ కార్డ్
8) స్మార్ట్ కార్డు (కార్మిక మంత్రిత్వ శాఖ పథకం)
9) పాస్‌పోర్ట్
10) పెన్షన్ డాక్యుమెంట్ (ఫోటో తప్పనిసరి)
11) యూనిక్ డిసేబిలిటీ గుర్తింపు కార్డు
12) అధికారిక గుర్తింపు కార్డు (ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు)
13) ఉద్యోగ గుర్తింపు కార్డు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం)
ఈ 13 ఐడెంటిటీ కార్డులలో ఏదైనా ఒకటి పోలింగ్ బూత్ వద్ద చూపించి ఓటు వేయొచ్చు.
