Apple iPhone 16 Price : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 అతి చవకైన ధరకే.. ఇంత తక్కువకు మళ్లీ జన్మలో రాదు..!

Apple iPhone 16 Price : విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ధర తగ్గింది.. అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 16 లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

1/5Apple iPhone 16 Price
Apple iPhone 16 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతిచోటా అనేక ఫోన్లపై భారీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఆఫర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.అప్‌గ్రేడ్ చిప్, మెరుగైన కెమెరాలు, ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టుతో ఆపిల్ ఐఫోన్ 16 చవకైన ధరకే లభిస్తోంది. ఇప్పటివరకు అతిపెద్ద ధర డిస్కౌంట్లలో ఇదొకటి.
2/5Apple iPhone 16 Price
మీరు కొనాలనుకుంటే ఇప్పుడే ఈ ఐఫోన్ కొనేసుకోండి. ప్రస్తుతం ఐఫోన్ 16 ధర రూ.17వేలకు పైగా తగ్గింది. భారత మార్కెట్లో ఐఫోన్ 16 రూ.79,900కి లాంచ్ అయింది. బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ కాకపోయినా విజయ్ సేల్స్‌లో సరసమైన ధరకే లభిస్తోంది. 128GB వేరియంట్ రూ.66,490 వద్ద లిస్ట్ అయింది. అసలు ధర నుంచి రూ.13,410 తక్కువ ధరకే లభ్యమవుతుంది.
3/5Apple iPhone 16 Price
మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐతో ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. తద్వారా రూ.4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే.. ఐఫోన్ 16 రూ.62,490కి తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లేకుండానే మొత్తం రూ.17,410 సేవ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్‌ బట్టి ఫైనల్ ధర తగ్గుతుంది.
4/5Apple iPhone 16 Price
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. 2000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కూడా పొందవచ్చు. హుడ్ కింద iOS 26తో ఆపిల్ A18 చిప్‌సెట్ కలిగి ఉంది. ఆన్-డివైస్ ఏఐ ఫీచర్‌లకు ఫుల్ ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టును అందిస్తుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ ఐఫోన్‌లో 48MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
5/5Apple iPhone 16 Price
అయితే, 12MP ఫ్రంట్ కెమెరా, సెల్ఫీలు, ఫేస్‌టైమ్‌లను కలిగి ఉంది. ఈ ఐఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3561mAh బ్యాటరీ పవర్ అందిస్తుంది. బేస్ మోడల్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీ కలిగి ఉంటుంది. అల్ట్రామెరైన్, టీల్, బ్లాక్, వైట్, పింక్ వంటి మల్టీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.