Congress President Poll: బేషరతు క్షమాపణ చెప్పిన కాంగ్రెస్ రేసు గుర్రం శశి థరూర్.. ఎందుకో తెలుసా?

బీజేపీ దీనిపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. బీజేపీ నేత అమిత్ మాలవీయ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ''శశిథరూర్‌కు ఇది మొదటి సారి కాదు. ఆయన రిపీట్ అఫెండర్. ఆయన ఇండియాను ముక్కలు చేయాలని కోరుకుంటారు. ఇప్పుడే కాదు, చాలాసార్లు ఆయన తన మనోగతాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు'' అని విమర్శించారు.

Shashi Tharoor said sorry for his manifesto amid congress chief poll

Congress President Poll: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి రేసులో ఉన్న ఎంపీ శశి థరూర్ ఉన్నట్టుండి వివాదంలో చిక్కుకున్నారు. అధ్యక్ష ఎన్నిక కోసం ఆయన ప్రత్యేకంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో తీవ్రమైన తప్పిదం చోటుచేసుకుంది. మేనిఫెస్టోలో ప్రచురించిన భారత మ్యాప్‌లో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ పూర్తి భాగాలు లేకపోవడం దుమారాన్ని లేపింది. దీంతో భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా.. ఇక సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.

జరిగిన తప్పును గ్రహించిన శశిథరూర్‌.. ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ‘‘మేనిఫోస్టోలో మ్యాప్‌పై ట్రోల్స్‌ తుపాను కొనసాగింది. ఉద్దేశపూర్వకంగా ఎవరూ ఇలాంటి పనులు చేయరు. ఓ చిన్న వాలంటీర్ల బృందం ఈ పొరపాటు చేసింది. తక్షణమే మేం దాన్ని సవరించాం. ఈ తప్పునకు క్షమాపణలు చెబుతున్నా. మా మానిఫెస్టో ఇదిగో’’ అని పేర్కొంటూ తన ట్విటర్‌లో హిందీ, ఆంగ్ల భాషల్లో రూపొందించిన మేనిఫెస్టో కాపీలను జత చేశారు.

ఇక బీజేపీ దీనిపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. బీజేపీ నేత అమిత్ మాలవీయ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ”శశిథరూర్‌కు ఇది మొదటి సారి కాదు. ఆయన రిపీట్ అఫెండర్. ఆయన ఇండియాను ముక్కలు చేయాలని కోరుకుంటారు. ఇప్పుడే కాదు, చాలాసార్లు ఆయన తన మనోగతాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు” అని విమర్శించారు.

థరూర్‌ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2019లోనూ సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(సీఏఏ)కు వ్యతిరేకంగా కేరళ కాంగ్రెస్ నిరసనకు సంబంధించిన బుక్‌లెట్ కవర్‌ను ఆయన షేర్ చేశారు. అప్పుడు కూడా లఢక్, జమ్మూకశ్మీర్‌లు లేని భారత్ మ్యాప్‌ను వాడారు. బీజేపీ విరుచుకుపడటంతో జరిగిన పొరపాటును గ్రహించి ఆతర్వాత మ్యాప్‌ను తొలగించారు.

Muslim Cleric: మోహన్ భగవత్‌ను పొగిడిన ముస్లిం మత గురువుకు బెదిరింపులు.. చంపుతామంటూ వార్నింగ్