జగన్ పాటకు డిప్యూటీ సీఎం టిక్ టాక్ వీడియో

  • Publish Date - January 1, 2020 / 06:26 AM IST

ఏపీ సీఎం  జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చేసిన టిక్‌టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న..’ అనే పాటకు శ్రీవాణి టిక్‌టాక్ వీడియో చేశారు.
 
గత ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్‌తో ఆకట్టుకున్నశ్రీవాణి మంత్రిగా ఓ కార్యక్రమంలో గిరిజనులతో స్టెప్పులు కూడా వేశారు. సీఎం సాంగ్ కు డిప్యూటీ సీఎం  చేసిన టిక్ టాక్  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.

ముఖ్యంగా జగన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు నెటిజన్లు లైక్‌లు కొట్టడంతో పాటు షేర్ చేయడంతో కొత్త సంవత్సరంలో వీడియో కాస్త ట్రెండింగ్‌ దిశగా దూసుకెళ్తోంది.