Telangana BJP: తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది? రోజుకో నేత సెన్సేషనల్ కామెంట్స్‌తో రచ్చ రచ్చ..
ఆయన పెట్టిన పోస్ట్‌పై కాకుండా ఆ పోస్ట్ పెట్టడానికి దారితీసిన పరిస్థితులపైన చర్చించాలంటున్నారట ఇంకొంతమంది బీజేపీ శ్రేణులు. ఇంతకూ ఆయన చేసిన పోస్ట్ ఏంటంటే..ఒక పార్టీలో కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన నాయకుడిని లీడర్ అంటారు..ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందిన వాడిని బ్రోకర్ అంటారు.
- Naveen
- Published On : March 11, 2026 / 11:56 PM IST
Representative Image (Image Credit To Original Source)
- పార్టీలో కోవర్టులు ఉన్నారన్న ఎంపీ అరవింద్
- ఎదగడం కోసం పార్టీలోకి వచ్చిన వాడు బ్రోకర్ అన్న NVSS
- బీజేపీలో గ్రూప్ వార్‌ను ఎక్స్‌పోజ్ చేసిన పోస్ట్
Telangana BJP: మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీలో పరిచయం అక్కర్లేని నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లాంటి నేత ఇలాంటి పోస్ట్ చేయడం ఏంటని చర్చించుకుంటున్నారు. కొంతమంది బీజేపీ శ్రేణులు ఆయన చేసిన పోస్ట్‌ను సమర్దిస్తుండగా.. మరికొందరు మాత్రం సరికాదన్నట్లుగా రెస్పాండ్ అవుతున్నారట. ఆయన పెట్టిన పోస్ట్‌పై కాకుండా ఆ పోస్ట్ పెట్టడానికి దారితీసిన పరిస్థితులపైన చర్చించాలంటున్నారట ఇంకొంతమంది బీజేపీ శ్రేణులు. ఇంతకూ ఆయన చేసిన పోస్ట్ ఏంటంటే..ఒక పార్టీలో కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన నాయకుడిని లీడర్ అంటారు..ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందిన వాడిని బ్రోకర్ అంటారు. అంటూ NVSS పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో గ్రూప్ వార్‌ను ఎక్స్‌పోజ్ చేస్తుందని అంటున్నారు.
NVSS పెట్టిన పోస్ట్‌కు బీజేపీ కార్యకర్తలు బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ట్యాగ్స్, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. మీ లాంటి సీనియర్ లీడర్ నుంచి ఇలాంటి పోస్ట్ రావడం మంచిగా లేదని..ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని బ్రోకర్ అనడం సరికాదని కొందరు అంటున్నారు. అలాంటప్పుడు పార్టీలో చేరికల కోసం జాయినింగ్ కమిటీలు ఎందుకు వేశారని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా పోస్ట్ పార్టీలో చేరాలనుకునే వారికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని..ఒక్కొక్కరు ఒక్కో తీరుగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు.
బీజేపీలో చేరిన వారిని అవమానించేలా..
NVSS పోస్ట్ బీజేపీలో చేరిన వారిని అవమానించేలా ఉన్నాయని..బ్రోకర్ అనే పదం వాడటాన్ని తప్పుబడుతున్నారు కొందరు నేతలు. ఇక మరికొంత మంది పార్టీ శ్రేణులు ఆయన చేసిన పోస్ట్‌ను సమర్దిస్తున్నారు. పార్టీలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోతున్నారు. కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని..పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తున్నారని వాపోతున్నారు. ఏమైనా అంటే వారికి ఎక్స్‌పీరియన్స్ ఉందని అంటున్నారని..ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్నవారిపై పెత్తనం చలాయిస్తే ఆవేదన ఉండదా అంటూ NVSSను సమర్ధిస్తున్న వారు లేకపోలేదు.
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆవేదనకు కారణం ఎవరు?
బీజేపీ సీనియర్ నేత పార్టీ ఉపాధ్యక్ష స్థాయిలో పనిచేసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆవేదనకు కారణం ఎవరు? ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ పోస్ట్ చేశారన్నదే ఇక్కడ కీలక పాయింట్. ఇతర పార్టీ నుంచి వచ్చి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీద పెత్తనం చేస్తున్నదెవరు? ఆయనపై పెత్తనం చలాయిస్తున్నది ఆయన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతనా? లేక రాష్ట్ర పార్టీలో కీలకంగా ఉన్న నేతలెవరైనా ఆజమాయిషీ చూపిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏది అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.
టార్గెట్ ఎంపీనా? మాజీ ఎమ్మెల్యేనా?
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం..మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్‌ను ఉద్దేశించే NVSS పోస్ట్ చేశారా అని పార్టీ ఆఫీస్‌లో చెవులు కొరుక్కుంటున్నారు నేతలు. లేక అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనను టార్గెట్ చేస్తూ ఎన్వీఎస్ఎస్ బ్రోకర్ అనే పదాన్ని వాడి ఉంటారా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టినప్పటికీ..అది రాష్ట్ర పార్టీలో దుమారం లేపుతోంది. ఆయన పెట్టిన పోస్ట్ బీజేపీలో చేరిన అందరు నేతల మనసులను గుచ్చుకునేలా ఉందంటున్నారు పలువురు బీజేపీ నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో ఎంపీలుగా గెలిచి..ఎమ్మెల్యేలుగా గెలిచి లేదా ఇతర పదవుల్లో ఉన్న నేతలందరికీ ఆ వ్యాఖ్యలు తాకే ప్రమాదం ఉందంటున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు NVSS ప్రభాకర్ వంటి నేతల నుంచి రావడంతో..ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు హర్ట్ అయ్యే అవకాశం లేకపోలేదని మాట్లాడుకుంటున్నారు నేతలు.
చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేద్దామనుకునే సమయంలో ఈ వ్యాఖ్యలు ఇబ్బందిగా మారేలా ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోందట. మరి ఎన్వీఎస్‌ఎస్ ఏదో అలా పోస్ట్ పెట్టారో..సీరియస్‌గా ఎవరినైనా టార్గెట్ చేశారో తెలియదు కానీ..ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టి ఉట్టారన్నదే లీడర్లను, క్యాడర్ కలవరపెడుతోందట.
Also Read: అందరికీ క్లీన్‌చిట్..! బీఆర్ఎస్ వాట్ నెక్ట్స్..? కోర్టులు అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందా?
