Manish Sisodia: విద్యామంత్రిని ప్రేమిస్తున్నామంటూ పోస్టర్.. పాఠశాలపై కేసు నమోదు
మార్చి 3న ఉదయం 8.30 గంటలకు కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శాస్త్రి పార్క్‌లోని ప్రభుత్వ పాఠశాల గేటు పైన బ్యానర్ ఏర్పాటు చేశారు. మొదట, వారు స్కూల్ నుంచి ఒక డెస్క్ తీసి బయటికి తీసుకొచ్చి దాని మీద ఎక్కి గేటుపై 'ఐ లవ్ మనీష్ సిసోడియా' అని పోస్టర్ వేయడం ప్రారంభించారు
- tony bekkal
- Published on- March 5, 2023 / 08:29 PM IST
Police Case Against Delhi School For "I Love Manish Sisodia" Banner
Manish Sisodia: లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మద్దతుగా బ్యానర్ ఏర్పాటు చేయడంతో ఒక పాఠశాల మీద కేసు నమోదు అయింది. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల గేటు వద్ద శనివారం ‘ఐ లవ్ మనీష్ సిసోడియా’ అనే బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్యానర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Rijiju vs Rahul: టుక్డే టుక్డే గ్యాంగ్ అంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి రిజిజు
స్థానిక నివాసి దివాకర్ పాండే ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు శాస్త్రి పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్‌లోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసి) కోఆర్డినేటర్ గజాలా, పాఠశాల ప్రిన్సిపాల్‌తో కలిసి పాఠశాల గేటుపై బ్యానర్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బ్యానర్ ఏర్పాటు చేసిన వారు ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్ తో సంబంధాలు ఉన్నవారని, ఆయన అండతోనే దీన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే బ్యానర్ ఏర్పాటుకు వారు ముందస్తు అనుమతి తీసుకోలేదని వెల్లడించారు.
Karnataka Assembly Polls: వేసవికి ముందే హీటెక్కిన కర్ణాటక.. మిగతావారి కంటే ఒక అడుగు ముందే ఉన్న ఓవైసీ
ఈ విషయమై స్థానిక పోలీసు అధికారి దివాకర్ పాండే మాట్లాడుతూ “మార్చి 3న ఉదయం 8.30 గంటలకు కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శాస్త్రి పార్క్‌లోని ప్రభుత్వ పాఠశాల గేటు పైన బ్యానర్ ఏర్పాటు చేశారు. మొదట, వారు స్కూల్ నుంచి ఒక డెస్క్ తీసి బయటికి తీసుకొచ్చి దాని మీద ఎక్కి గేటుపై ‘ఐ లవ్ మనీష్ సిసోడియా’ అని పోస్టర్ వేయడం ప్రారంభించారు. దానికి ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యాలయం దేవాలయమని, వాటికి రాజకీయాల్ని దూరంగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేశారు. అయినప్పటికీ వారు వినకుండా బ్యానర్ ఏర్పాటు చేశారు’’ అని తెలిపారు.
