Sharat Prathipati Arrest : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్
శరత్ ను గుంటూరు నుంచి మాచవరానికి తరలించారు. మాచవరంలోని ఓ హోటల్ లో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు.
- Naveen
- Published On : February 29, 2024 / 05:28 PM IST
Sharat Prathipati Arrest
Sharat Prathipati Arrest : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పన్ను ఎగవేత కేసులో ఆయనను గుంటూరులో మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్తిపాటి శరత్.. ఓ కంపెనీని నడుపుతున్నారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
శరత్ పై జీఎస్టీ అధికారులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన పోలీసులు.. శరత్ ను అరెస్ట్ చేశారు. శరత్ ను గుంటూరు నుంచి మాచవరానికి తరలించారు. మాచవరంలోని ఓ హోటల్ లో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు.
Also Read : వైసీపీ జోరు, విపక్షం బేజారు.. ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుంది..?
