Opposition Meet: అంత చర్చా చేసి రాహుల్ గాంధీని పెళ్లికి ఒప్పించారట.. విపక్షాల మీటింగ్‌పై బీజేపీ షార్ప్ అటాక్
విపక్షాల సమావేశాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయునన్న విషయం విపక్షాలకు కూడా తెలుసని అయితే తమ అసమర్థతను ప్రజల ముందు చూపించుకోలేక చేస్తున్న హడావిడే ఇదని ఆయన ఎద్దేవా చేశారు
- tony bekkal
- Published On : June 24, 2023 / 10:05 AM IST
Rahul Gandhi Marriage: పాట్నాలో జరిగిన విపక్షాల మెగా సమావేశం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పెద్ద సవాలుగా మారుతుందని ఆ సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీలన్నీ శుక్రవారం ఒక్క గొంతుకగా స్పష్టం చేశాయి. అయితే ఈ సమావేశం ఓ ఫొటో సెషన్ మాత్రమేనని, విపక్షాల ఐక్యత అసాధ్యమని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అంతే కాదు, ఈ సమావేశం ద్వారా ఒక పని అయితే జరిగిందని, మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ అయిన రాహుల్ గాంధీని విపక్షాలన్నీ కలిసి విజయవంతంగా పెళ్లికి ఒప్పించాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సెటైర్లు విసిరారు.
Kerala Politics: చీటింగ్ కేసులో అరెస్టైన కాంగ్రెస్ చీఫ్.. కాసేపటికి బెయిల్‌పై విడుదల
విపక్షాల సమావేశాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయునన్న విషయం విపక్షాలకు కూడా తెలుసని అయితే తమ అసమర్థతను ప్రజల ముందు చూపించుకోలేక చేస్తున్న హడావిడే ఇదని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘2024 ఎన్నికల ముందు స్టేజీని సిద్ధం చేశారు. ఆర్టిస్టులంతా ఒక్క చోటకు చేరారు. క్యారెక్టర్లు కూడా ఫైనల్ అయ్యాయి. ఇక డ్రామా మొదలవుతుంది. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకునే ప్రకటనలు ఇక నుంచి పెద్ద ఎత్తున వస్తుంటాయి. అయినప్పటికీ ప్రజల నుంచి ఆదరణ దొరకదు. ప్రధానమంత్రి మరోసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు’’ అని అనురాగ్ ఠాకూర్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.
Opposition Meet: తిరిగి తిరిగి కాంగ్రెస్ చెంతకే ప్రతిపక్షాలు.. పాట్నా మెగా మీటింగ్‌లో ఏం జరిగింది?
శుక్రవారం సమావేశం అనంతరం రాహుల్ గాంధీ పెళ్లిపై పలువురు నేతలు చర్చించారు. ఇంకా ఆలస్యమేమీ కాలేదు, ఇప్పటికైనా పెళ్లి చేసుకోమంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కోరారు. ‘‘మీరు మా సలహా వినడం లేదు. మీ అమ్మను బాధ పెడుతున్నారు. తన మాట వినడం లేదని మీ అమ్మగారు చెప్పారు. ఇంకా సమయం దాటలేదు. ఇప్పటికైనా పెళ్లి చేసుకోండి. మేమంతా మీ పెళ్లి బారాత్‌లో పాల్గొంటాం. మా మాట విను’’ అంటూ రాహుల్ గాంధీని లాలూ అడిగారు. వీటిని పరోక్షంగా ప్రస్తావిస్తూనే అనురాగ్ ఠాకూర్ పై విధంగా స్పందించారు.
