Opposition Meet: తిరిగి తిరిగి కాంగ్రెస్ చెంతకే ప్రతిపక్షాలు.. పాట్నా మెగా మీటింగ్‌లో ఏం జరిగింది?
వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అంతటి ప్రాధాన్యత లేకుండా, మొత్తంగా స్థానిక పార్టీల ఒప్పందంతోనే ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కారణం, కూటమి ప్రయత్నాల్లో ఉన్న నితీశ్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నారు

Opposition Meet: బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల మెగా సమావేశం కొంత వరకు సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. తాము ముందు నుంచి చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కలిసి కదనభేరి మోగించాయి. అందరూ కలిసికట్టుగా కమల దళాన్ని ఎదుర్కునేందుకు ప్రతినబూనాయి. దీనికి సంబంధించి ఉమ్మడా అజెండా ఏదీ సిద్ధం కాలేదు. కానీ మలిదశ చర్చలు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో జూలై 10-12 మధ్య మరోమారు విపక్షాల సమావేశం జరగనున్నట్లు శుక్రవారం వెల్లడించారు. అక్కడ జరిగే చర్చల్లో అజెండా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది.
Mega India-US Deals: మోదీ పర్యటనతో మెగా ఇండియా-యూఎస్ కీలక ఒప్పందాలు
వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అంతటి ప్రాధాన్యత లేకుండా, మొత్తంగా స్థానిక పార్టీల ఒప్పందంతోనే ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కారణం, కూటమి ప్రయత్నాల్లో ఉన్న నితీశ్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని చెప్పనప్పటకీ, ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ పలుమార్లు పలు వేదికలపై వెల్లడించారు. అయితే శుక్రవారం జరిగిన విపక్షాల మీటింగ్‌ను బట్టి చూస్తే నితీశ్ ఆశలు గల్లంతైనట్లే కనిపిస్తోంది.
Kerala Politics: చీటింగ్ కేసులో అరెస్టైన కాంగ్రెస్ చీఫ్.. కాసేపటికి బెయిల్‌పై విడుదల
కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు విపక్ష పార్టీలు దాదాపుగా సరే అన్నాయి. అయితే కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీకి మద్దతు ఇస్తూనే, స్థానిక పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ మద్దతు తీసుకోనున్నాయి. వాస్తవానికి ఇలాంటి ప్రతిపాదన ఒకటి మమతా బెనర్జీ గతంలోనే పెట్టారు. స్థానిక పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోకి కాంగ్రెస్ రావద్దని అప్పట్లో అల్టిమేటమే ఇచ్చారు. దాదాపుగా మమతా చేసిన ప్రతిపాదనకు పాట్నా సమావేశంలో ఆమోదం లభించినట్లుగానే కనిపిస్తోంది.
ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి స్టాలిన్ గట్టి మద్దతు ఇస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటనలు చేశారు. కానీ మిగిలిన ప్రతిపక్షాలు ఈ మాటపై విముఖత వ్యక్తం చేశాయి. దీనిపై తమ అభిప్రాయం చెప్పలేక మౌనంగా ఉండిపోయాయి. నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలకు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామని, ప్రధాని అభ్యర్థిత్వం వరకు వెళ్దామని ఆశలు పెట్టుకున్నప్పటికీ పాట్నా సమావేశం అనంతరం వాటిని వదులుకోవాల్సి వస్తోంది. దాదాపు అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించాయి.