Mega India-US Deals: మోదీ పర్యటనతో మెగా ఇండియా-యూఎస్ కీలక ఒప్పందాలు

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జరిపిన అమెరికా పర్యటన వల్ల భారత్-అమెరికా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ సహకారం రంగం నుంచి అంతరిక్ష యాత్రలు, వీసా నిబంధనల వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించే లక్ష్యంతో సాగాయి....

Mega India-US Deals: మోదీ పర్యటనతో మెగా ఇండియా-యూఎస్ కీలక ఒప్పందాలు

Mega India-US Deals

Mega India-US Deals: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జరిపిన అమెరికా పర్యటన వల్ల భారత్-అమెరికా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ సహకారం రంగం నుంచి అంతరిక్ష యాత్రలు, వీసా నిబంధనల వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించే లక్ష్యంతో సాగాయి. (PM Modi US Visit 2023) భారతదేశంలో ఫైటర్ జెట్ ఇంజిన్‌లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) కంపెనీతో జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) ఏరోస్పేస్ చేసుకున్న ఒప్పందం కీలకమైనది. ఈ ఒప్పందంతో భారత వైమానిక దళానికి కావాల్సిన పవర్ ఫైటర్ జెట్స్, తేజాస్ ఇంజిన్లను హెచ్ఏఎల్ యూఎస్ అందించే సాంకేతికతో సొంతంగా తయారు చేయనుంది. ఈ ఒప్పందంతో ఎఫ్ 414 టెక్నాలజీని యూఎస్ భారత్ కు అందించనుంది.భారతీయ చరిత్రలో అతిపెద్ద రక్షణ ఒప్పందాల్లో ఇది ఒకటి.

31 ఎంక్యూ-9బి సీ గార్డియన్ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం

అమెరికాలోని జనరల్ ఆటోమిక్స్ నుంచి 31 ఎంక్యూ-9బి సీ గార్డియన్ డ్రోన్ల కొనుగోలుకు భారతదేశ రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.   ఈ యుద్ధ డ్రోన్లను జీఈ తయారీ సంస్థ భారతదేశంలో డ్రోన్ అసెంబ్లీంగ్ యూనిట్ ను నెలకొల్పనుంది. భారత నేవికి 15 సీ గార్డియన్స్ డ్రోన్లు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు 8 చొప్పున స్కై గార్డియన్ డ్రోన్ల సేకరణకు ఒప్పందం కుదిరింది.

గుజరాత్ రాష్ట్రంలో మైక్రోన్ టెక్నాలజీ కర్మాగారం

భారతదేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి ప్రముఖ అమెరికన్ చిప్ మేకర్ మైక్రోన్ టెక్నాలజీకి మోదీ ఆహ్వానం పలకడం ఈ పర్యటనలో మరో పెద్ద పరిణామం. ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి ఆటోమొబైల్స్ వరకు వాడే సెమీ కండక్టర్లు కీలకం. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో 825మిలియన్ డాలర్లతో యూఎస్ మైక్రాన్ టెక్నాలజీ మొట్టమొదటి కర్మాగారాన్ని నిర్మించనుంది. ఈ పెట్టుబడిలో 50శాతం కేంద్రం, 20 శాతం గుజరాత్ రాష్ట్రం నిధులు కేటాయించనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు యూఎస్ కంపెనీ అంగీకరించింది. యూఎస్,భారతదేశాల మధ్య వర్తక, వ్యాపార రంగంలో ఆరు వివాదాలను పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు అంగీకరించాయని యూఎస్ ట్రేడ్ ప్రతినిధి కాథెరిన్ చెప్పారు. ఎప్సీలాన్ కార్బన్ లిమిటెడ్ 650 మిలియన్ డాలర్లతో వెహికల్ బ్యాటరీ కాంపోనెంట్ ఫ్యాక్టరీని భారత్ లో నెలకొల్పనుంది. భారతదేశంలో సోలార్ ప్యానల్ తయారీ పరిశ్రమను వీఎస్కే ఎనర్జీ ఎల్ఎల్ సీ ఏర్పాటు చేయనుంది.

హెచ్-1బి వీసా నిబంధనలు సరళతరం

అమెరికాలో భారతీయులు నివసించేందుకు, పనిచేసేందుకు వీలుగా వీసా నిబంధనలను జో బిడెన్ సర్కారు సరళతరం చేసింది. భారతదేశం, యూఎస్ హెచ్ -1 బి వీసా ప్రాసెసింగ్ మార్పులను ప్రకటించడం దౌత్య సంబంధాలలో కీలక పరిణామం. హెచ్-1బి వీసాలను భారతదేశానికి వెళ్లకుండానే రెన్యువల్ చేసుకోవచ్చు.  దీంతోపాటు భారతదేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో కొత్త యూఎస్ కాన్సులేట్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యూఎస్ నిర్ణయించింది.

అంతరిక్ష యాత్రలో భారత్‌కు చోటు

2025వ సంవత్సరం నాటికి మళ్లీ చంద్రునిపైకి మానవులను పంపే అమెరికా నేతృత్వంలోని ఆర్టెమిస్ అకార్డ్స్‌లో భారత్ కూడా చేరనుంది.  అంగారక గ్రహం వెలుపల అంతరిక్ష పరిశోధనలను విస్తరించే లక్ష్యంతో ఈ యాత్రలు కొనసాగుతాయని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్ డ్ వైర్ లెస్, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో ఇండో-యూఎస్ సంయుక్తంగా పరిశోధనలు కొనసాగనున్నాయి.