Karnataka Politics: ఈ ఎన్నికల్లోనే కాదు 2018లో కూడా అవే చివరి ఎన్నికలన్న సిద్ధారామయ్య, 2013లో కూడా అదే మాట

ఇవే తనకు చివరి ఎన్నికలని సిద్ధూ వ్యాఖ్యానించడం ఇది తొలిసారి కాదు. గత అసెంబ్లీ (2018) ఎన్నికల్లో కూడా ఆయన ఈ వ్యాఖ్యలే చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలే కాదు 2013 నాటి ఎన్నికల్లో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే 2013లో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవడానికి కారణం..

siddaramaiah

Siddaramaiah: కర్ణాటక ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య (siddaramaiah) ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికలే తనకు చివరివంటూ కాంగ్రెస్‌ను గెలిపించాలనే ఉద్దేశంతో సిద్ధూ చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది. ఇవే తనకు చివరి ఎన్నికలని సిద్ధరామయ్య చేసిన ప్రచారంతో ఓటర్లు బాగా ప్రభావితమయ్యారు. అవినీతి సర్కార్‌ను కూలదోశారు. కాంగ్రెస్‌ పార్టీ క్యాంపెయిన్‌ టీమ్‌లో సిద్ధరామయ్య ప్రధాన ఆకర్షణ. ఆయనకు పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ తోడుకావడంతో హస్తం పార్టీ కన్నడ సీమను హస్తగతం చేసుకోగలిగింది.

Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. రేపు ప్రమాణ స్వీకారం.. వాటివల్లే డీకేకు దూరమైన సీఎం చైర్

అయితే ఇవే తనకు చివరి ఎన్నికలని సిద్ధూ వ్యాఖ్యానించడం ఇది తొలిసారి కాదు. గత అసెంబ్లీ (2018) ఎన్నికల్లో కూడా ఆయన ఈ వ్యాఖ్యలే చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలే కాదు 2013 నాటి ఎన్నికల్లో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే 2013లో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవడానికి కారణం.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి అప్పట్లో వచ్చిన ఒత్తిడే కారణమట. అందుకే 2018 ఎన్నికల్లో మళ్లీ పోటీకి దిగినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి విపక్షానికే పరిమితమైంది.

Siddaramaiah Political Journey: కన్నడ రాజకీయాల్లో మాస్‌లీడర్‌గా సిద్ధరామయ్య.. మచ్చలేని రాజకీయ జీవితం ఆయన సొంతం

అయితే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి గల కారణాలేంటో ఇప్పటికైతే స్పష్టం చేయలేదు. కానీ, ఎన్నికల ప్రచారంలో మాత్రం ఇవే తనకు చివరి ఎన్నికలని మాత్రం తరుచూ చెప్పుకొచ్చారు. దశాబ్దానికి పైగా ఈ మాట చెబుతూనే ఉన్నారు. తన రిటైర్మెంట్ ద్వారా ప్రజలను ఆకర్షించి ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సిద్ధరామయ్య ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు.