విజయవాడ : మళ్లీ జగన్ టూర్ చేయనున్నారు. విదేశీ టూర్ అనుకొనేరు…కాదు…జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడానికి..ఇప్పటికే ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన జగన్..ఈసారి జిల్లాల్లో పర్యటించాలని జనవరి 25వ తేదీ శుక్రవారం నిర్ణయించారు. జిల్లాల్లో పార్టీ బలోపేతంపై పూర్తిస్థాయిలో జగన్ ఫోకస్ పెట్టారు. ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన తరువాత జిల్లాల వారీగా జగన్ రివ్యూ సమావేశాలు నిర్వహించారు.
జిల్లాల్లో నెలకొన్న పరిస్థితి..పార్టీ నేతల మధ్య నెలకొన్న సమస్యలు..ఇతరత్రా వాటిపై చెక్ పెట్టాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ నుండి జిల్లాల టూర్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. ఇందుకు సమరశంఖం పేరు నిర్ణయించారు. జిల్లాల్లో పార్టీ నేతలు..బూత్ స్థాయి నేతలతో భేటీలు జరుపడానికి పార్టీ సన్నాహాలు చేస్తోంది. అంతేగాకుండా బూత్ స్థాయి నేతలతో కూడా భేటీ కావాలని జగన్ నిర్ణయించారు. జగన్ టూర్‌తో జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందా ? అనేది చూడాలి.